నాగార్జునకి ఇష్టం లేదు కానీ

నాగార్జునకి ఇష్టం లేదు కానీ

ఒక చిన్న చిత్రంలో షేర్‌ నాగార్జున తీసుకోవడం, నిర్మాతల్లో ఒకరిగా పేరు కూడా వేసుకోవడంతో సదరు చిత్రానికి క్రేజ్‌ పెరిగింది. మేనల్లుడు సుషాంత్‌ హీరోగా నటించిన 'చి.ల.సౌ' చిత్రాన్ని నాగార్జున కొనడానికి కారణం చుట్టరికం కాదట. సినిమా చూసి బాగా నచ్చడం వల్లే షేర్‌ తీసుకున్నాడు. అయితే ప్రమోషన్‌పై ఎక్కువ టైమ్‌ కేటాయించాలని, విడుదలకి ముందే వీలయినంత క్రేజ్‌ తీసుకురావాలని నాగార్జున భావించాడు.

కానీ అప్పటికే విడుదల తేదీ ప్రకటించిన చిత్రాన్ని ఆలస్యం చేయడానికి ఆ చిత్ర బృందం అంత సుముఖంగా లేదట. దాంతో ఒక వారం మాత్రం వాయిదా వేసి ఈ చిత్రాన్ని ఈ శుక్రవారం విడుదల చేస్తున్నారు. అడివి శేష్‌ నటించిన గూఢచారి చిత్రానికి క్రేజ్‌ బాగానే వుంది. అదే ఆడియన్స్‌ని టార్గెట్‌ చేస్తోన్న 'చి.ల.సౌ' కూడా అదే రోజు వస్తోంది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది ఎక్కువగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనేది చూడాలి.

ఆగస్టు మొదటి వారంలో కాకుండా ఈ చిత్రాన్ని వాయిదా వేయాలంటే తగిన సమయమే దొరకడం లేదట. శ్రీనివాస కళ్యాణం నుంచి బాక్సాఫీస్‌ బిజీ అయిపోతుంది కనుక నాగార్జునకి ఇష్టం లేకపోయినా ఈ చిత్రాన్ని 3న విడుదల చేసేస్తున్నారు. అయితే గూఢచారితో క్లాష్‌ పడడంతో ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్నట్టు జులై 27నే విడుదల చేసేసి వుండాల్సిందని ఇప్పుడనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు