సవ్యసాచి ఔట్.. అల్లుడు ఫిక్స్

సవ్యసాచి ఔట్.. అల్లుడు ఫిక్స్

మొత్తానికి అక్కినేని నాగచైతన్య నుంచి తర్వాత విడుదల కాబోయే సినిమా ఏదో తేలిపోయింది. ముందు మొదలుపెట్టిన ‘సవ్యసాచి’ని వెనక్కి నెట్టి.. లేటుగా మొదలై చకచకా పూర్తయిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రమే రేసులో ముందు నిలిచింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేయబోతున్నారు. ఆ చిత్ర రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ కన్ఫమ్ చేసింది. ఆగస్టు 31న ఈ చిత్రం రిలీజవుతుందని ఇంతకుముందే వార్తలొచ్చాయి. కానీ దీని కంటే ముందు తాము చైతూతో మొదలుపెట్టిన ‘సవ్యసాచి’నే ముందు రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ పట్టుబట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి ఆగస్టు ద్వితీయార్ధంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేసింది. ఆ సినిమా ఈ నెలలోనే వచ్చేట్లయితే ‘శైలజా రెడ్డి అల్లుడు’ను వెనక్కి జరపాలన్నట్లుగా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

ఐతే ‘సవ్యసాచి’ టీం అనుకున్న ప్రకారం పని ముగించే పరిస్థితి కనిపించలేదు. దీంతో ‘శైలజా రెడ్డి అల్లుడు’ డేట్ మార్చుకోవాల్సిన అవసరం లేకపోయింది. అనుకున్నట్లే ఆగస్టు 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఆడియో కూడా లాంచ్ చేయబోతున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించింది. అను ఇమ్మాన్యుయెల్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇక గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ ‘సవ్యసాచి’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి సమయం పట్టేలా ఉంది. ఆ చిత్రం సెప్టెంబరు లేదా అక్టోబరులో విడుదలయ్యే అవకాశాలున్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చైతూ సరసన నిధి అగర్వాల్ నటించింది. మాధవన్ కీలక పాత్ర పోషించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు