ఆ సినిమా టైటిల్ వెన్నెల కిషోర్ పెట్టాడట

ఆ సినిమా టైటిల్ వెన్నెల కిషోర్ పెట్టాడట

ఈ మధ్య ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన సినిమా ‘చి ల సౌ’. ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు పెద్దగా అంచనాల్లేవు కానీ.. దీని టీజర్లు.. ట్రైలర్ చూశాక అంచనాలు కలిగాయి. దీని ప్రోమోలు మాత్రమే కాదు.. టైటిల్ కూడా కొత్తగా అనిపించేదే. విశేషం ఏంటంటే ఈ టైటిల్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పెట్టింది కాదట. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ టైటిల్ సూచించాడట. ఈ విషయాన్ని రాహులే స్వయంగా వెల్లడించాడు.

ముందు అతను ఈ సినిమాకు ‘చిరంజీవి అర్జున్’ అని టైటిల్ పెట్టుకున్నాడట. ఐతే సినిమా మొదలు పెట్టడానికి ముందే ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చి సెన్సేషనల్ హిట్టవడంతో.. మళ్లీ దాని క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ టైటిల్ పెట్టారేమో అన్న డౌట్లు వస్తాయేమో అని పేరు మార్చాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ వెల్లడించాడు. ఆ సమయంలో వెన్నెలి కిషోరే ‘చి ల సౌ’ అనే టైటిల్ సూచించాడని.. తనతో పాటు అందరికీ నచ్చడంతో ఇదే ఖరారైందని రాహుల్ తెలిపాడు.

‘చి ల సౌ’ పూర్తయ్యాక తన స్నేహితురాలైన సమంత.. తాను సినిమా ఎలా తీశానో అని టెన్షన్ పడుతుంటే.. ఆమెకు స్పెషల్ షో వేసి చూపించానని.. ఆమెకు  నచ్చి చైతూకు చూపించిందని... ఆ తర్వాత నాగార్జున కూడా చూసి ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి అయ్యాడని రాహుల్ తెలిపాడు. సినిమా చూశాక ‘నీకు చాలా మంచి భవిష్యత్ ఉంది నాన్నా’ అని నాగార్జున్ కాంప్లిమెంట్ ఇచ్చారని.. అప్పుడు తనకు ఆస్కార్ గెలిచినంత ఆనందం కలిగిందని రాహుల్ చెప్పాడు. తన తర్వాతి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లోనే ఉంటుందని రాహుల్ స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English