మన తెనాలి పిల్ల బాగా బిజీ అయిపోయిందే

మన తెనాలి పిల్ల బాగా బిజీ అయిపోయిందే

మిస్ ఇండియా అందాల పోటీల్లో జయకేతనం ఎగురవేసి మోడలింగ్ లో రాణించి.. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది అచ్చ తెలుగు అందం శోభిత ధూళిపాళ్ల.  బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న శోభిత ఇప్పుడు టాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

శోభిత ధూళిపాళ్ల ఫిలిం బాలీవుడ్ లోనే స్టార్ట్ చేసింది. అనురాగ్ కాశ్యప్ డైరెక్షన్ లో వచ్చిన రమణ్ రాఘవ్ 2.0లో ఆమె హీరోయిన్ గా నటించింది. ఇందులో తన నటన నచ్చడంతో అడవి శేష్ తనను కలిసి గూఢచారి సినిమా ఆఫర్ చేశాడంటూ చెప్పుకొచ్చింది శోభిత. ఇందులో హార్వర్డ్ నుంచి వచ్చిన సైకాలజిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తుంది. కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్ నచ్చడంతో సొంత భాష తెలుగులో అడుగుపెట్టడానికి ఇదే కరెక్ట్ మూవీ అని భావించి గూఢచారి ప్రాజెక్టుకు ఓకే చెప్పానని శోభిత తెలిపింది.

శోభిత ఇప్పటికే బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన బ్లాక్ కామెడీ కాలాకండీలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మితో ఓ సినిమా పూర్తి చేసింది. దీంతోపాటు మళయాళ నటుడు నివిన్ పౌలీతో మూతోన్ సినిమా చేస్తోంది. ఇలా ఇటు నార్త్, ఇటు సౌత్ సినిమాలతో తెగ బిజీగా ఉన్నానంటోందీ తెలుగు సుందరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు