వారాహిపై శ్రీరెడ్డి మాటల దాడి

వారాహిపై శ్రీరెడ్డి మాటల దాడి

కాస్టింగ్ కౌచ్ పై పోరాటమంటూ వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి తరవాత వరస ఆరోపణలతో బోలెడు సంచలనాలు సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వివాదం తరవాత టాలీవుడ్ లో ఆమె మాటలను పట్టించుకోవడం మానేశారు. ఆ తరవాత సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎప్పటికప్పుడు కొత్త పేర్లు.. కొత్త ఆరోపణలతో న్యూస్ లో కనిపిస్తూనే ఉంది.

ఈమధ్య శ్రీరెడ్డి మకాం మార్చి చెన్నైకు వెళ్లి తన ఆరోపణల పర్వం మొదలుపెట్టింది. ఎప్పటిలాగే ఎలాంటి ఆధారాలు చూపించకుండానే అక్కడి డైరెక్టర్లు ఎ.ఆర్.మురుగదాస్ - సుందర్.సి - రాఘవ లారెన్స్ లాంటి వాళ్లంతా తనకు అవకాశాలు ఇస్తానంటూ మోసం చేశారని చెప్పుకొచ్చింది. దీనిపై సహజంగానే కోలీవుడ్ వాళ్లకు కోపమొచ్చింది. అక్కడి దర్శకుడు వారాహి ఓ అడుగు ముందుకేసి శ్రీరెడ్డిపై ప్రాస్టిట్యూషన్ కేసు పెట్టాడు. దీంతో మండిపడిన ఆమె అతడిపై చెన్నైలో ఎదురు కేసు పెట్టింది. బాధితురాలైన తనకు సపోర్ట్ ఇవ్వడం మానేసి తనపై కేసు పెట్టిన అతడి భరతం పడతానంటూ సోషల్ మీడియా పోస్టింగులతో శ్రీరెడ్డి విరుచుకు పడింది. తన సహాయం అవసరమైన మహిళలు అందరికీ సాయపడుతూనే ఉంటానని చెప్పుకొచ్చింది.

మామూలుగానే శ్రీరెడ్డి లాంగ్వేజ్ కాస్త వివాదాస్పదంగా ఉంటుంది. వారాహిపై పెట్టిన పోస్టుల్లో ఆమె మాటల దాడి మరీ ఎక్కువైంది. శ్రీరెడ్డి కొద్దిరోజులుగా చెన్నైలోనే ఉంటూ అక్కడి వెబ్ ఛానళ్లు... మ్యాగజైన్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాంట్రవర్సీలతో హీటెక్కిస్తోంది. మరి ఈ వ్యవహారంపై కోలీవుడ్  ఎలా రియాక్టవుతుంది అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. టాలీవుడ్ జనాల్లా ఈ ఇష్యూని లైట్ తీసుకుంటుందా.. లేక కొత్తగా ఏమన్నా చేయబోతున్నారా.. లెట్స్ వెయిట్ అండ్ సీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు