బన్నీ వదిలేసిన ‘గీత గోవిందం’

బన్నీ వదిలేసిన ‘గీత గోవిందం’

ఎవరి కోసమో రాసిన కథ.. వేరెవరి దగ్గరికో వెళ్లడం కొత్తేమీ కాదు. కొన్నిసార్లు హీరోలు కథ నచ్చక రిజెక్ట్ చేస్తుంటారు. కొన్నిసార్లు కథ నచ్చినా.. వీలు కుదరక సినిమా చేయలేకపోతుంటారు. అలా ఆ కథలు వేరెవ్వరి దగ్గరికో వెళ్తుంటాయి. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘గీత గోవిందం’ సినిమా నిజానికి అల్లు అర్జున్ చేయాల్సిందట. గీతా ఆర్ట్స్ బేనర్లో ‘శ్రీరస్తు శుభమస్తు’ తీసిన పరశురామ్.. దాని తర్వాత ‘గీత గోవిందం’ కథ రాసుకుని ముందుగా బన్నీకే చెప్పాడట. ఐతే బన్నీకి కథ నచ్చినా కూడా ఈ సినిమా చేయలేకపోయాడట. అందుకు కారణమేంటన్నది బన్నీ వెల్లడించలేదు. ఐతే ఈ కథ విని నచ్చి... తర్వాత దాన్ని మైండ్ నుంచి తీసేసి వేరే సినిమాల్లో బిజీ అయిపోయానని అన్నాడు బన్నీ.

ఐతే కథ నచ్చడం వల్ల ఇందులో హీరోయిన్ పాత్ర కోసం తనకు తెలిసిన హీరోయిన్లకు రెఫర్ చేశానని బన్నీ వెల్లడించాడు. కానీ తాను రెఫర్ చేసిన హీరోయిన్లెవరూ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని.. చివరికి రష్మిక ఈ సినిమా చేసిందని.. ఆమె గీత పాత్రలో అదరగొట్టేసిందని బన్నీ చెప్పాడు. తాను ఆల్రెడీ సినిమా చూశానని.. చాలా బాగుందని.. కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా హీరోయిన్ డామినేటెడ్ గా ఉంటుందని బన్నీ చెప్పడాన్ని బట్టి చూస్తే.. ఈ సినిమా అతను చేయకపోవడానికి బహుశా అదే ప్రధాన కారణమై ఉండొచ్చు.

కానీ ఇక్కడో విశేషం ఏంటంటే.. హీరోయిన్ డామినేటెడ్‌గా ఉన్న ఈ కథను విజయ్ తన పెర్ఫామెన్స్,‌తో బాయ్-గర్ల్ స్టోరీగా మార్చినట్లుగా బన్నీ చెప్పాడు. విజయ్ పెర్ఫామెన్స్ చూశాక బన్నీకి ఈ కథలో విషయంలో అభిప్రాయాలు మారితే మారుండొచ్చేమో. మరి ‘గీత గోవిందం’ను కాదని ‘నా పేరు సూర్య’ సినిమా చేసిన బన్నీ.. ఆగస్టు 15న రాబోయే ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే.. తన నిర్ణయం పట్ల రిగ్రెట్ అవుతాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు