పెళ్ళయితే రొమాన్స్ చేయకూడదా?

పెళ్ళయితే రొమాన్స్ చేయకూడదా?

మొదటి సినిమా ఛలోతోనే తెలుగు ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టేసింది శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మండన్న.  కన్నడ సినిమా కిరిక్ పార్టీతో (తెలుగులో కిరాక్ పార్టీ) రష్మిక కెరీర్ ప్రారంభించింది. ఆ సినిమా అక్కడ పెద్ద హిట్ కావడంతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఆమెను ఛలో సినిమాలో ఛాన్స్ దక్కింది. ఈ సినిమా ఒప్పుకునే పాటికే ఆమె తన మొదటి సినిమా కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో పెళ్లికి ఓకే చెప్పేసి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది.

రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి గీతగోవిందం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరో విజయ్ ఆమెను వీపుపై ఎత్తుకుని మోసుకెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వెంటనే రష్మికపై కొందరు కామెంట్ల దాడి మొదలెట్టారు. రక్షిత్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నా ఇలాంటి రొమాంటిక్ సీన్లు ఎలా చేస్తావంటూ ఆమెను తప్పుపట్టడం మొదలెట్టారు. రష్మిక వీళ్లకు ఘాటుగానే రిప్లయ్ ఇచ్చింది. ‘‘మగాళ్లు పెళ్లయ్యాక కూడా వేరే హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయొచ్చు. దానికి మీకు ఎలాంటి ప్రాబ్లెం ఉండదు. అదే ఓ హీరోయిన్ పెళ్లయ్యాక వేరే హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే మీరు తట్టుకోలేదు. ఆమెపై మీకున్న గౌరవం పోతుంది. ఇదే న్యాయం?’’ అంటూ రష్మిక ఎదురు ప్రశ్నించింది.

‘‘కొందరు ఫేక్ అకౌంట్లతో ఇష్టమొచ్చినట్టు కామెంట్ పెడతారు. ఎందుకిలా కామెంట్ చేస్తారంటే సారీ చెబుతూ మీతో మాట్లాడాలనే అలా చేశామంటారు. అరె.. మేమూ మనుషులమే. మా ఫీలింగ్స్ హర్ట్ చేస్తే ఎలా? నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్లలో వేరే వాళ్ల ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. వాళ్లలోని జెలసీ వాళ్ల మాటల్లోనే తెలిసిపోతుంది. అలాంటి వాళ్లను నేను ఎంతమాత్రమే కేర్ చేయను’’ అంటోంది రష్మిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు