డిజె బ్యూటి లక్ రివర్సయిందా?

డిజె బ్యూటి లక్ రివర్సయిందా?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. ఒకసారి సినిమా ఫ్లాపయినా అందులో నటించిన వాళ్లకు మాత్రం తెగ గుర్తింపు వచ్చేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నటించి దువ్వాడ జగన్నాథమ్ లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే విషయంలో ఇదే జరిగింది. ఆ సినిమా ఫ్లాపయినా గ్లామర్ ధారాళంగా ఒలకబోసిన పూజా హెగ్డే మాత్రం ఆడియన్స్ కు తెగ నచ్చేసింది.

పూజా హెగ్డేలోని గ్లామర్ యాంగిల్ కు టాలీవుడ్ జనాలు బాగానే ఫిదా అయ్యారు. దాంతో ఆమెకు వరస ఆఫర్లు వచ్చాయి. దీని తరవాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేసి సాక్ష్యం సినిమాలో పూజా నటించింది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. ఈ మూవీ రిజల్ట్ తేడా కొట్టడం ఆమె తరవాత సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ప్రభాస్ సాహో తరవాత జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్ లో చేయబోయే సినిమాకు పూజా హెగ్డేనే హీరోయిన్ గా తీసుకుకన్నారు.

సాహో షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక రాధాకృష్ణ డైరెక్షన్ లో మూవీ స్టార్టవుతుంది. ఇప్పుడు సాక్ష్యం రిజల్టు చూశాక ఆ సినిమా యూనిట్ హీరోయిన్ ను మార్చే ఆలోచనలో పడిందట. ఎందుకంటే సాక్ష్యంలో పూజా హీరోయిన్ గా ఉన్న ఆ సినిమాకు పెద్దగా బజ్ రాలేదు. అందుకని హీరోయిన్ ను మారిస్తే ఎలాగుంటుంది అనే విషయం చర్చిస్తున్నారట. ఈ ఛాన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే పెద్దగా అవకాశాలు దొరక్క ఇబ్బందుల్లో ఉన్న రకుల్ ను లక్కు వరించినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు