నమ్ముకున్నోడు హ్యాండిచ్చేశాడే..

నమ్ముకున్నోడు హ్యాండిచ్చేశాడే..

‘ఏమైంది ఈవేళ’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినా.. తర్వాత ‘రచ్చ’ లాంటి భారీ సినిమా చేసి దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు సంపత్ నంది. ఈ సినిమా మంచి హిట్టవడంతో అతడి దశ తిరిగేలా కనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం లభించింది. దీంతో గాల్లో తేలిపోయాడు సంపత్. కానీ ఏం లాభం.. రెండేళ్ల పాటు ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ కోసం పని చేస్తే.. చివరికి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ స్థితిలో ఏ దర్శకుడైనా జావగారిపోతాడు. కానీ సంపత్ మాత్రం కంగారు పడకుండా రెండు క్రేజీ ప్రాజెక్టులు పట్టాడు.

అవి మంచి ఫలితాన్నిస్తే సంపత్‌కు ఢోకా లేకపోయేది.కానీ రవితేజతో చేసిన ‘బెంగాల్ టైగర్’.. గోపీచంద్‌తో తీసిన ‘గౌతమ్ నంద’ నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు సంపత్‌కు మరో అవకాశం ఇచ్చే హీరో.. నిర్మాతలు కనిపించడం లేదు. ‘గౌతమ్ నంద’ తర్వాత మళ్లీ సంపత్‌‌తో పని చేయడానికి గోపీ ఆసక్తి చూపించాడు కానీ.. ‘పంతం’ తేడా కొట్టాక అతడి ఆలోచన మారిపోయింది.

మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన సంపత్‌తో సినిమా వద్దనుకున్నాడు. కుమార్ సాయి అనే కొత్త దర్శకుడు చెప్పిన వెరైటీ కథకే ఓటేశాడు. సంపత్ సినిమాను పక్కన పెట్టేశాడు. ఈ రోజుల్లో రొటీన్ కమర్షియల్ సినిమాలు వర్కవుట్ కాదని.. సంపత్‌తో వద్దని కొందరు సన్నిహితులు ఇచ్చిన వార్నింగ్ మేరకే గోపీ అతడితో సిినిమా మానుకున్నట్లు తెలుస్తోంది. మరి నమ్ముకున్న గోపీ హ్యాండిచ్చిన నేపథ్యంలో సంపత్ ఎవరితో సినిమా ఓకే చేయించుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English