మారుతి.. పూరి స్టయిల్లో మాట్లాడుతున్నాడే

మారుతి.. పూరి స్టయిల్లో మాట్లాడుతున్నాడే

టాలీవుడ్లో చాలా స్పీడుగా స్క్రిప్టు రాసి సినిమా తీసేసే దర్శకుల్లో పూరి జగన్నాథ్ పేరు ముందు చెప్పుకోవాలి. చాలా తక్కువ సమయంలోనే ఆయన 40 దాకా సినిమాలు చేసేశారు. ఆయన ఎప్పుడు మీడియాను కలిసినా.. తన దగ్గర పదేళ్లకు సరిపడా కథలు ఉన్నాయని అంటుంటాడు. పూరి లాగే చాలా స్పీడుగా సినిమాలు తీసే మారుతి సైతం ఈ మాటే చెబుతున్నాడు.

తన దగ్గరున్న కథలన్నీ సినిమాలు తీస్తే పదేళ్ల పమయం పడుతుందని అతను చెప్పాడు. తన స్క్రిప్టుతో తెరకెక్కిన ‘బ్రాండ్ బాబు’ ప్రమోషన్లలో భాగంగా మారుతి ఈ మాట అన్నాడు. తన కథలతో వేరే దర్శకులు సినిమాలు చేయడంపై స్పందిస్తూ మారుతి ఈ మాట చెప్పాడు.

‘‘నా దగ్గరున్న కథలను నేను సినిమాలుగా తీయాలంటే పదేళ్ల వరకు సరిపోతాయి. అదీగాక కొన్నేళ్ల తర్వాత ట్రెండ్‌ మారిపోతుంటుంది. నేనే డైరెక్ట్‌ చేయాలనుకుంటే.. నేను అనుకున్న కథలన్నింటినీ సినిమాలుగా తీయలేకపోవచ్చు’’ అని మారుతి చెప్పాడు. నిజానికి ‘బ్రాండ్ బాబు’ కథతోశర్వానంద్ హీరోగా సినిమా చేయాలనుకున్నాడట మారుతి.

యువి క్రియేషన్స్ బేనర్లో ఈ సినిమాకు సన్నాహాలు కూడా జరిగాయట. కానీ శర్వా ఇంకేదైనా భిన్నమైన క్యారెక్టరైజేషన్ ఉన్న కథతో సినిమా చేద్దామని అంటే.. ‘మహానుభావుడు’ తీసినట్లు చెప్పాడు మారుతి. ఇప్పుడు అనుకోకుండా ‘బ్రాండ్ బాబు’ తెరకెక్కిందని.. ప్రభాకర్ తన కథను చక్కగా తీశాడని మారుతి అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు