ఆర్ఎక్స్ దర్శకుడితో ధనుష్?

ఆర్ఎక్స్ దర్శకుడితో ధనుష్?

రెండు వారాల కిందట విడుదలైన చిన్న సినిమా ‘ఆర్ఎక్స్ 100’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం రెండు కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం దానికి ఐదారు రెట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఈ సినిమాతో అజయ్ భూపతి పేరు టాలీవుడ్లోనే కాక.. వేరే ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది.

అతడికి బాలీవుడ్.. కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాంటమ్ పిక్చర్స్ అతడితో సినిమా తీసేందుకు అడ్వాన్స్ ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి.

ఫాంటమ్ సంస్థలో అతను చేసేది ‘ఆర్ఎక్స్ 100’ రీమేక్ అని కొందరంటుండగా.. లేదు కొత్త సినిమా అని ఇంకొందరంటున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుస్ సైతం అజయ్ భూపతితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లుగా ఇప్పుడు వార్తలొస్తుండటం విశేషం. ఇటీవలే చెన్నైలో ‘ఆర్ఎక్స్ 100’ చూసి ఇంప్రెస్ అయ్యాడట ధనుష్. అతను ఆల్రెడీ అజయ్‌తో మాట్లాడినట్లు కూడా చెబుతున్నారు.

నిజంగా ధనుష్‌తో అజయ్ సినిమా చేసేట్లయితే మాత్రం అది అతడికి బంపరాఫరే. గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుని.. హాలీవుడ్ సినిమా కూడా చేసిన ధనుష్‌తో ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ దర్శకుడూ పని చేయలేదు. అలాంటిది ఒక్క సినిమాతో అజయ్‌కి ఆ అవకాశం దక్కితే గొప్ప విషయమే. మరి ఈ వార్తలో నిజమెంతో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు