ఆ హీరోకి ఆఫర్లు ఇచ్చే వారే లేరా?

ఆ హీరోకి ఆఫర్లు ఇచ్చే వారే లేరా?

నిన్న మొన్నటి వరకు చిన్న సినిమాలకి పెద్ద హీరోగా వెలిగిన రాజ్‌ తరుణ్‌ పరిస్థితి ఇప్పుడు రివర్స్‌ అయింది. వరుస పెట్టి చేసిన ఫ్లాప్‌ సినిమాలు అతడి కెరియర్‌ని ఎఫెక్ట్‌ చేసాయి. ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌కి అవకాశమిచ్చే వారే లేరని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నాగార్జున, దిల్‌ రాజు లాంటి నిర్మాతలు నిర్మించిన చిత్రాలకి నామమాత్రపు ఓపెనింగ్స్‌ కూడా రాకపోయే సరికి హీరో మార్కెట్‌ ఎంతగా పడిపోయిందనేది అర్థమైపోయింది.

దీంతో అతనికి అడ్వాన్సులు ఇచ్చిన కొందరు నిర్మాతలు వెనక్కి తీసేసుకున్నారట. అతను ఓకే చేసిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు వేరే హీరోల అప్రూవల్‌ కోసం వెళ్లాయట. లవర్‌తో పాటు మరో సినిమా అతనితోనే తీద్దామని భావించిన దిల్‌ రాజు ఇప్పుడా ఆలోచన డ్రాప్‌ అయ్యాడట. ఎనిమిది కోట్లకి పైగా పెట్టుబడి పెట్టిన లవర్‌ చిత్రానికి థియేటర్ల నుంచి ఏమీ వసూలు కాకపోవడంతో దిల్‌ రాజుకే మతి పోయిందట.

తన బ్యానర్‌ వేల్యూతో సినిమాలకి వసూళ్లు వచ్చేస్తాయని ఫీలయ్యే దిల్‌ రాజుకి లవర్‌ ఫలితంతో చాలా పెద్ద షాక్‌ తగలడంతో ఇకపై మార్కెట్‌ లేని హీరోలతో సినిమాలు చేయనని అనేస్తున్నాడట. ఏదేమైనా కొద్ది కాలంలోనే సక్సెస్‌ఫుల్‌ హీరో కాస్తా ఆఫర్లు లేని హీరోగా మారిపోవడం తెలుగు చిత్ర పరిశ్రమలో యువ నటులకి సక్సెస్‌ని కొనసాగించడం ఎంత కీలకమో తెలియజేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు