ప్లానింగ్‌ లేని పవన్‌ కళ్యాణ్‌

ప్లానింగ్‌ లేని పవన్‌ కళ్యాణ్‌

ప్రజారాజ్యం టైమ్‌లో చిరంజీవి అవసరానికి మించి జాగ్రత్త పడితే, జనసేన విషయంలో పవన్‌ కళ్యాణ్‌ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. టూర్లు అయితే వేస్తున్నాడు కానీ ఇంతవరకు బలమైన నాయకుడు ఒక్కడినీ పవన్‌ ఆకట్టుకోలేకపోయాడు. చిన్నా చితకా లీడర్లు మాత్రమే పవన్‌ పార్టీ వైపు వస్తున్నారు.

రాష్ట్రమంతా ఎన్ని సార్లు టూర్‌ వేద్దామని పవన్‌ భావిస్తున్నాడనేది తెలియదు కానీ ప్రస్తుతానికి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారితో చర్చించడం మాత్రమే పవన్‌ చేస్తున్నాడట. ఇంతవరకు కేడర్‌ సమీకరించే పని చేయకపోవడం, స్థానికంగా నాయకులని గుర్తించలేకపోవడం పవన్‌ బలహీనతలని, ఇలాగే గాలివాటంగా టూర్‌ చేసుకుంటూ పోతే పవన్‌ని ప్రజలు సీరియస్‌గా తీసుకోరని విశ్లేషకులు అంటున్నారు.

తన సభలకి జనం బాగా రావడంతో అవన్నీ ఓట్లుగా మారిపోతాయనే అపోహ తగదని, పార్టీ నాయకుడికి ఎంత గ్లామర్‌ వున్నా స్థానిక నాయకత్వంపైనే ఒక పార్టీ విజయావకాశాలు ఆధారపడి వుంటాయని పవన్‌ గుర్తించకపోవడం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీగా దిగడానికి సంసిద్ధంగా లేకపోవడం, అన్ని పార్టీలతోను విబేధించి ప్రస్తుతం ఎవరితోను పొత్తు పెట్టుకోలేని స్థితిలో వుండడంతో పవన్‌ అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో అతని ధోరణి పట్ల పెదవి విరుస్తున్నారు. ఇలాగైతే జనసేన గెలవడం మాట అటుంచి వచ్చే ఎన్నికల్లో కనీస స్థాయిలో అయినా ప్రభావం చూపించడం కూడా అనుమానమే అంటున్నారు. ఇదంతా పవన్‌ ఎప్పటికి రియలైజ్‌ అవుతాడో, ఎప్పుడు తన పార్టీని స్థానికంగా బలోపేతం చేసుకుంటూ వస్తాడో అతనికే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు