'బిగ్‌ బాస్‌' బిగ్‌ స్కామ్‌ అంటున్న తేజస్వి తండ్రి

'బిగ్‌ బాస్‌' బిగ్‌ స్కామ్‌ అంటున్న తేజస్వి తండ్రి

బిగ్‌ బాస్‌ హౌస్‌లోంచి తేజస్వి బయటకి రాగానే వెంటనే మళ్లీ లోపలికి వెళ్లే అవకాశాన్ని కల్పించారు. వెళ్లిపోయిన కంటెస్టెంట్స్‌లో ఒకరిని తిరిగి హౌస్‌లోకి తీసుకురావడం కోసం బిగ్‌బాస్‌ పబ్లిక్‌ పోల్‌ పెట్టారు. తన పీఆర్‌ సాయంతో మళ్లీ హౌస్‌లోకి వెళదామని చూసిన తేజస్వి ఇందుకోసం బాగానే ఖర్చు పెట్టిందట. అయితే పబ్లిక్‌లో ఆమె పట్ల వున్న వ్యతిరేకతకి తోడు కౌశల్‌కి వున్న సపోర్ట్‌ ఆమెకి అడ్డు పడ్డాయి.

కౌశల్‌కి సపోర్ట్‌గా నిలుస్తాడని నూతన్‌ నాయుడుకి కౌశల్‌ ఆర్మీ వత్తాసు పలికింది. ఇక న్యూట్రల్‌ ఆడియన్స్‌ అయితే యాంకర్‌ శ్యామలకి ఓట్లు వేసారు. దీంతో తేజస్వి ఎంత ట్రై చేసినా కానీ పబ్లిక్‌ ఓటింగ్‌ని దాటలేకపోయింది. తేజస్వికి మరో అవకాశం ఇవ్వడానికి బిగ్‌బాస్‌ కొన్ని ప్రయత్నాలు చేసినట్టే అనిపించినా కానీ పబ్లిక్‌ ముందు తలవంచక తప్పలేదు. టీవీ ఇంటర్వ్యూల్లో ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్లు, ఈలోగా హౌస్‌లో తన సన్నిహితులు చేసిన పనులు ఆమెని నిలువునా ముంచేసాయి.

కనీసం ఇద్దరిని తిరిగి హౌస్‌లోకి పంపిస్తే అయినా తేజస్వికి అవకాశం వుంటుందేమో అనుకున్నారట. కానీ తేజస్వికి ఓటింగ్‌లో రెండవ స్థానం కూడా దక్కలేదు. దీంతో బిగ్‌బాస్‌ పెద్ద స్కామ్‌ అని తేజస్వి దత్త తండ్రి శరత్‌ షెట్టి ఆరోపిస్తున్నాడు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కోసం ఆక్షన్‌ పెట్టారని కూడా అతను ఆరోపించాడు. ఇంతకాలం తేజస్వికి మద్దతుగానే వ్యవహరించిన బిగ్‌బాస్‌, నాని ఈ ఆరోపణల పట్ల ఎలా రియాక్ట్‌ అవుతారనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English