ఒక్క ఫైట్ లేకుండా సినిమా తీస్తాడట

ఒక్క ఫైట్ లేకుండా సినిమా తీస్తాడట

ప్రతి దర్శకుడికీ ఒక శైలి ఉంటుంది. ఆ దర్శకుడి పేరు పోస్టర్ మీద కనిపించగానే ఆ సినిమాలో ఫలానా అంశాలు ఉండొచ్చన్న అంచనా ప్రేక్షకుడికి కలుగుతుంది. శ్రీవాస్ విషయానికి వస్తే.. అతను యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. తొలి సినిమా ‘లక్ష్యం’ నుంచి లేటెస్ట్ మూవీ ‘సాక్ష్యం’ వరకు అన్నింట్లోనూ యాక్షన్‌కే పెద్ద పీట వేశాడు. ఫైట్లు లేకుండా అతను సినిమా తీయలేడని అనిపిస్తుంది. ఎక్కువగా ఒక ఫార్ములా ప్రకారం నడిచిపోయే సినిమాలే చేశాడతను. ఐతే తాను కూడా కాన్సెప్ట్  బేస్డ్ సినిమాలు చేయగలనని.. వైవిధ్యం చూపించగలనని అతనంటున్నాడు. తన దగ్గర ఒక వైవిధ్యమైన కథ ఉందని.. ఒక్క ఫైట్ కూడా లేకుండా ఈ సినిమా ఉంటుందని.. తనకు ఆ సినిమా కొత్తగా ఉంటుందని శ్రీవాస్ తెలిపాడు. ఆ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్ది.. దానికి సరిపోయే నటీనటులతో సినిమా మొదలుపెడతానని అతను చెప్పాడు.

‘సాక్ష్యం’ లాంటి భారీ సినిమాను ఒక పెద్ద స్టార్‌తో చేయాల్సిందన్న అభిప్రాయాలపై శ్రీవాస్ స్పందిస్తూ.. ఎవరైనా పెద్ద హీరోల్ని పెట్టుకుంటే.. రకరకాల ఆబ్లిగేషన్లు వస్తాయని.. కథను కొంచెం మార్చాల్సి వస్తుందని.. అందుకే ఎలాంటి ఇమేజ్ అడ్డం రాకుండా ఉండాలని బెల్లంకొండ శ్రీనివాస్‌ను తీసుకున్నానని.. అతను స్టార్ హీరోల తరహాలోనే ఈ సినిమాకు న్యాయం చేశాడని శ్రీవాస్ చెప్పాడు. ఈ సినిమా చూశాక శ్రీనివాస్ తల్లి కన్నీళ్లు పెట్టుకుందని.. తన కొడుకును హీరోగా నిలబెట్టావంటూ ఆనందంతో తనను హత్తుకుందని చెప్పాడు శ్రీవాస్. ‘సాక్ష్యం’లో హింస ఎక్కువైందన్న విమర్శలపై అతను స్పందిస్తూ.. కథకు అవసరం కాబట్టే అలాంటి సీన్లు పెట్టాల్సి ఉందని.. వాటి విషయంలో ప్రేక్షకులకు ఎలాంటి అభ్యంతరం లేదని భావిస్తున్నట్లు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు