చైతూ-సామ్ నిశ్చితార్థమే మలుపు..

చైతూ-సామ్ నిశ్చితార్థమే మలుపు..

తన బావ అక్కినేని నాగచైతన్యకు.. సమంతకు జరిగిన వివాహ నిశ్చితార్థమే తన కెరీర్‌కు మలుపు అంటున్నాడు నాగార్జున మేనల్లుడు సుశాంత్. హీరోగా నిలదొక్కుకోవడానికి పదేళ్లకు పైగా ప్రయత్నిస్తున్న సుశాంత్‌కు ఇప్పటిదాకా ఒక్క హిట్టూ దక్కలేదు. సొంత బేనర్లో నాలుగు సినిమాలు చేస్తే నాలుగూ నిరాశ పరిచాయి.

ఐతే అతడి కొత్త సినిమా ‘చి ల సౌ’ మాత్రం ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఒక కొత్త కాన్సెప్ట్‌ ట్రై చేసిన సుశాంత్.. బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో మెప్పించినట్లే కనిపిస్తున్నాడు. దీని టీజర్లు.. ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది.

ఐతే ఈ సినిమాకు పునాది పడింది చైతూ-సామ్ నిశ్చితార్థంలోనే అంటున్నాడు సుశాంత్. ఆ వేడుకలో తాను.. రాహుల్ రవీంద్రన్ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నామని.. ఆ సందర్భంగానే తాను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నానో.. తన అబిరుచులేంటో అతడికి చెప్పానని.. ఆ తర్వాత కొన్ని రోజులకే రాహుల్ తనకు ‘చి ల సౌ’ కథ చెప్పాడని సుశాంత్ వెల్లడించాడు.

ఈ కథ విషయంలో తాను ఎవ్వరి సలహాలూ తీసుకోలేదని.. తనకు తానుగా స్వీయ నిర్ణయంతో చేసిన తొలి సినిమా ఇదే అని సుశాంత్ తెలిపాడు. సినిమా పూర్తయ్యాక ముందుగా సమంత చూసి మెచ్చిందని.. ఆపై నాగచైతన్యకూ చూపించిందని.. వాళ్లిద్దరికీ నచ్చడంతో ఇది అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద రిలీజవుతోందని.. ఈ రకంగా తాను ఈ సినిమాలో సమంత-చైతూలది కీలక పాత్ర అని సుశాంత్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English