ఒకేసారి నలుగురు రాణులు

ఒకేసారి నలుగురు రాణులు


బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ ఫిలిం క్వీన్ రీమేక్ ల పరంగా సౌత్ ఇండియాలో ఓ కొత్త రికార్డు సృష్టించబోతోంది. క్వీన్ మూవీని  ఒకేసారి నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్లతో రీమేక్ చేస్తున్నారు. ఈ నాలుగు సినిమాలను నలుగురు దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు. ఒకే  కథతో నాలుగు భాషల్లో తీసిన సినిమాలు ఒకేసారి థియేట్లరకు రానుండటం విశేషం.

క్వీన్ సినిమాను తెలుగులో దటీజ్ మహాలక్ష్మి పేరుతో రీమేక్ చేస్తున్నారు. అ! ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. తమిళ వెర్షన్ లో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తోంది. పారిస్.. పారిస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నటి రేవతి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక మళయాళ వెర్షన్ లో హీరోయిన్ గా సాహసం శ్వాసగా సాగిపో ఫేమ్ మంజిమా మోహన్ నటిస్తోంది. ఈ మూవీని తెలుగు దర్శకుడు నీలకంఠ డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నడ వెర్షన్ కు నటుడు రమేష్ డైరెక్షన్ చేస్తున్నారు. పారుల్ యాదవ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడలో బటర్ ఫ్లై పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఈ నాలుగు వెర్షన్లను ప్రొడ్యూసర్ మను కుమార్ నిర్మించారు. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వీటిలో తమిళం - మళయాళం - కన్నడ వెర్షన్లు స్పీడుగానే కంప్లీట్ అయ్యాయి. తెలుగులోనూ మొదట నీలకంఠ దర్శకత్వంలోనే షూటింగ్ స్టార్ట్ చేశారు. మొదటి షెడ్యూల్ తరవాత ఆయన ఆ బాధ్యత నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి ప్రశాంత్ వర్మ వచ్చి సూపర్ స్పీడ్ గా కంప్లీట్ చేశాడు. ఈ నాలుగు భాషల సినిమాలను ఒకే ప్లేస్ లో షూట్ చేయడం ఇంకో విశేషం. నలుగురు రాణుల్లో ఎవరు ప్రేక్షకులను ఎక్కువ మెప్పిస్తారో చూడాలి.