కలాం స్కూల్లో మెగా కపుల్ మెరుస్తున్నారు

కలాం స్కూల్లో మెగా కపుల్ మెరుస్తున్నారు

ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. కానీ అదితిరావ్ హైదరీ మాత్రం ఈ విషయంలో చాలా డిఫరెంట్. అచ్చ తెలుగుమ్మాయే అయినా ముందు బాలీవుడ్ లో.. ఆ తరవాత కోలీవుడ్ లో పేరు తెచ్చుకుని తీరిగ్గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన సమ్మోహనం సినిమాతో ప్రేక్షకులను నిజంగానే సమ్మోహన పరిచింది అదితి రావ్ హైదరి.

ప్రస్తుతం అదితి ఘాజీ ఫేం డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కోసం యూనిట్ తాజాగా మాజీ రాష్ట్రపతి - మిస్సైల్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న ఎ.పి.జె. అబ్దుల్ కలాం చిన్నప్పుడు తమిళనాడులో చదువుకున్న స్కూల్ కు వెళ్లింది. ఆయన చదువుకున్న తరగతి గది చూసిన హీరో వరుణ్ తేజ్ - హీరోయిన్ అదితి తెగ సంబరపడిపోయారు. ఆ ఫొటోలను అదితి తన ట్విట్టర్ టైమ్ లైన్ లో స్వయంగా షేర్ చేసింది. ‘‘అబ్దుల్ కలాం కూర్చున్న తరగతి గదిలోనే తాము కూర్చున్నామని.. ఆయన తెలివితేటల్లో కొంతయినా తమ బుర్రలకు అంటాటలని కోరుకుంటున్నామంటూ’’ అంటూ అదితి ఫన్నీగా ట్వీట్ చేసింది.

ఈ సినిమాలో వరుణ్‌ అండ్ అదితి ఇద్దరూ వ్యోమగాములుగా (ఆస్ర్టోనాట్స్) కనిపించనున్నారు. అంటే కలాం స్కూల్ నుండి అంతరిక్షంలోకి కూడా కలసి వెళ్తారన్నమాట. ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో భారీ స్పేస్ సెట్ వేసి మరీ షూటింగ్ పూర్తి చేశారు. ఇక అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సినిమాలో ఇంకో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ''అంతరిక్షం'' అని టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు