గూఢచారి కోసం అర్జున్ రెడ్డి సెంటిమెంట్

గూఢచారి కోసం అర్జున్ రెడ్డి సెంటిమెంట్

తెలుగులో స్పై థ్రిల్లర్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఈమధ్య మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమా ఇదే కాన్సెప్ట్ తో వచ్చింది. కాకపోతే ఆ సినిమా చూసిన ఆడియన్స్ కు ఎక్కడా స్పై సినిమా చూశామన్న ఫీల రాలేదు. తాజాగా అడవి శేష్ గూఢచారి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆగస్టు 3న ఈ మూవీ థియేటర్లకు రానుంది.  

గూఢచారి మూవీ ట్రయిలర్ ఇప్పటికే రిలీజై ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ వచ్చింది. గూఢచారి సినిమాకు తన సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని అంటున్నాడు నాచురల్ స్టార్ నాని. గూఢచారి సినిమా ట్రయిలర్ ను నానియే రిలీజ్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా ట్రయిలర్ కూడా నానియే రిలీజ్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా యూత్ కు విపరీతంగా నచ్చడంతో పాటు రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు గూఢచారి కూడా అదే రేంజిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది నాని మాట. అయితే కేవలం హ్యాండ్ సెంటిమెంట్ కలిసొస్తే సినిమాలు ఆడేయవులే. అలాగే కంటెంట్ ఉన్న సినిమాలకు ఏ హ్యాండ్ పడకపోయినా సినిమా ఆడేస్తుంది. కాకపోతే నాని మాటలు నిజం అవ్వాలని అడివి శేష్‌ కూడా చూస్తున్నాడు.

ఇకపోతే అందాల పోటీలతో వెలుగులోకి వచ్చిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. హీరో నాగార్జున మేనకోడలు... పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయిలో హీరోయిన్ గా కనిపించిన సుప్రియ ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది. కొత్త డైరెక్టర్ శశి కిరణ్ తిక్క గూఢచారి మూవీకి దర్శకత్వం వహించాడు.