పాపం త్రిష.. మళ్లీ పంచ్ పడింది

పాపం త్రిష.. మళ్లీ పంచ్ పడింది

ఒకప్పుడు ఏ హీరోయిన్ అయినా పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నా లేదంటే 30 ప్లస్ వయసులో పడ్డా వాళ్ల కెరీర్ దాదాపుగా ముగిసినట్లే అనుకునేవాళ్లు. కానీ ఈ సంప్రదాయాన్ని కొందరు హీరోయిన్లు బ్రేక్ చేశారు. అనుష్క, నయనతార.. వీళ్లిద్దరూ ఈ సుదీర్ఘ కాలం కెరీర్లను కొనసాగించారు. 30 ప్లస్‌లోనూ సత్తా చాటారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి క్రేజ్ తీసుకొచ్చి.. వీటితోనూ కాసుల వర్షం కురిపించవచ్చని చాటిన సౌత్ హీరోయిన్లలో వీళ్లిద్దరి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి.

ఐతే వీరి కోవలోనే తాను కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో వెలిగిపోవాలని చూసింది త్రిష. ఆమెకు మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ఆ సినిమాలు వరుసగా బోల్తా కొట్టేస్తున్నాయి. త్రిష ఇంతకుముందు ‘నాయకి’ అనే లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇటు తెలుగులో.. అటు తమిళంలో డిజాస్టర్ అయింది.

ఐతే హార్రర్ కామెడీలకు కాలం చెల్లిన సంగతి గుర్తించకుండా త్రిష మళ్లీ.. అదే జానర్లో ఇంకో సినిమా చేసింది. అదే ‘మోహిని’. ‘నాయకి’ లాగే దీనికి రిలీజ్ కష్టాలు తప్పలేదు. మొదలైన రెండేళ్లకు కానీ ఇది విడుదలకు నోచుకోలేదు. ఈ శుక్రవారం తమిళ-తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఫలితం మాత్రం మారలేదు. దీనికీ రెండు చోట్లా ఫ్లాప్ టాకే వచ్చింది. సినిమా పాత చింతకాయ పచ్చడి అంటూ తీసి పడేశారు క్రిటిక్స్. మినిమం ఓపెనింగ్స్ లేవు ఈ చిత్రానికి.

తెలుగులో అయితే అసలు ఈ చిత్రం రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియదు. ఏదో నామమాత్రంగా రిలీజ్ చేశారు. కనీస స్పందన లేకపోయింది. తమిళంలో కూడా పరిస్థితి మెరుగ్గా లేదు. త్రిష ఖాతాలో మరో ఫ్లాప్ ఖాయమని.. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాల మీద ఆమె ఆశలు వదులుకోవాల్సిందే అని తేలిపోయింది. ఓవైపు అనుష్క.. నయన్ హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్‌తో తమ స్టేచర్ ఎంతో పెంచుకుంటుంటే.. వాళ్లకు దీటైన స్టార్ అయిన త్రిష పరిస్థితి ఇలా అయిపోయింది పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు