‘ఎన్టీఆర్’లోనూ క్రిష్ నటిస్తున్నాడా?

‘ఎన్టీఆర్’లోనూ క్రిష్ నటిస్తున్నాడా?

‘మహానటి’ సినిమాలో క్యామియో పాత్రల్లో తళుక్కుమన్న నటుల్లో దర్శకుడు క్రిష్ కూడా ఒకడు. ఆయన అందులో దిగ్దర్శకుడు కె.వి.రెడ్డి పాత్రలో కనిపించాడు. ఉన్నది కాసేపే అయినా చక్కగా నటించి తనదైన ముద్ర వేశాడు. ఆయన ఆహార్యం కె.వి.రెడ్డి పాత్రకు బాగానే సూట్ అయింది. ఇప్పుడు క్రిష్ మరోసారి కె.వి.రెడ్డి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు.. క్రిష్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్.

ఈ చిత్రంలోనూ కె.వి.రెడ్డి పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం వేరెవరినో ఎంచుకోవడం ఎందుకని.. ఆల్రెడీ ఆ పాత్ర గురించి అవగాహన ఉంది కాబట్టి తనే చేయాలని క్రిష్ భావిస్తున్నాడట. ఈ విషయంలో తర్జన భర్జన పడుతుంటే బాలయ్యే ఆయనకు సర్దిచెప్పి ఈ పాత్ర చేయిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే.. క్రిష్ తనను తానే డైరెక్ట్ చేసుకోబోతుండటం విశేషమే. మరి ‘మహానటి’తో పోలిస్తే ‘యన్.టి.ఆర్’లో క్రిష్ ఏమైనా మార్పు చూపిస్తాడా.. అలాగే కనిపిస్తాడా అన్నది చూడాలి. కె.వి.రెడ్డితో ఎన్టీఆర్‌కు గొప్ప అనుబంధమే ఉంది. ఎన్టీఆర్ కెరీర్ ఎదుగుదలలో కె.వి.రెడ్డి పాత్ర కీలకం.

ఇక ‘యన్.టి.ఆర్’ సినిమాలో ఇలాంటి క్యామియో రోల్స్ చాలానే ఉన్నాయి. ఈ పాత్రలకు అనేకమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు.. నరేష్.. సచిన్ ఖేద్కర్.. ఇలా రోజుకో పేరు బయటికి వస్తోంది. అన్ని పాత్రలకూ దాదాపుగా నటీనటుల ఎంపిక పూర్తయినట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తయింది. కొన్ని రోజల పాటు బాలీవుడ్ సినిమా ‘మణికర్ణిక’ పని చూసి.. ఆ తర్వాత రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నాడు క్రిష్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు