ఆ సినిమా నుంచి ఔట్.. పెళ్లి కోసమే

ఆ సినిమా నుంచి ఔట్.. పెళ్లి కోసమే

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హిందీ సినిమాల్లో కనిపించి చాలా కాలం అయిపోయింది. ఆమె అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో పాటు కొన్ని హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ యుఎస్‌కే పరిమితం అయిపోయింది. చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ సినిమా ‘భరత్’లో ఆమె కథానాయికగా నటించడానికి ఒప్పుకుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలుపెట్టారు.
మరి కొన్ని రోజుల్లోనే ప్రియాంక షూటింగ్‌కు హాజరవుతుందని భావిస్తుండగా.. ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. చివరికి అదే నిజమని తేలింది. స్వయంగా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫరే ఈ చిత్రంలో ప్రియాంక లేదని తేల్చేశాడు. ఈ మేరకు అతను ఒక ఆసక్తికర ట్వీట్ చేశాడు.

ప్రియాంక తన సినిమాలో లేదని.. ఇందుకు కారణం చాలా ప్రత్యేకమైందని.. తన నిర్ణయం గురించి ఇటీవలే ఆమె వెల్లడించిందని.. ఆమె విషయంలో తామంతా చాలా హ్యాపీ అని అన్నాడు అబ్బాస్. ఈ సంగతి చెబుతూ.. మధ్యలో ‘నిక్ ఆఫ్ ఎ టైమ్’ అనే మాట వాడాడు అబ్బాస్. ప్రియాంక చోప్రా బాయ్ ఫ్రెండ్ పేరు నిక్ జోనాస్ అన్న సంగతి తెలిసిందే. అతడితో ఆమెకు ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరి పెళ్లి కూడా ఉంటుందని అంటున్నారు.

అబ్బాస్ ట్వీట్‌ను బట్టి చూస్తే అది నిజమే అని స్పష్టమవుతోంది. తనకంటే 11 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్‌తో కొన్ని నెలలుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ప్రియాంక. ఇటీవలే ప్రియాంకతో కలిసి నిక్ ఇండియాకు కూడా వచ్చాడు. ప్రియాంక కుటుంబ సభ్యుల్ని కలిశాడు. ప్రియాంక కూడా నిక్ కుటుంబ సభ్యుల్ని ఇప్పటికే కలిసింది. ఏ హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English