పెళ్లి రూమర్లపై మండిపడింది

పెళ్లి రూమర్లపై మండిపడింది

ఒక స్టార్ హీరోయిన్ కెరీర్ దీర్ఘ కాలం సాగి.. ఆమె కొంచెం డౌన్ అవ్వగానే మీడియాలో పెళ్లి ముచ్చట్లు మొదలైపోతాయి. మిల్కీ బ్యూటీ తమన్నా విషయంలోనూ అదే జరుగుతోంది కొన్ని రోజులుగా. త‌మ‌న్నా కుటుంబ సభ్యులు కొన్నాళ్ళుగా ఆమె కోసం సంబంధాలు చూస్తుండ‌గా.. అమెరికాకి చెందిన డాక్ట‌ర్‌తో సంబంధం ఖాయం చేశారని.. త్వ‌ర‌లోనే వీరిద్ధ‌రికి నిశ్చితార్ధం జరిపి, ఆ త‌ర్వాత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయాల‌ని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నార‌ని ఇటీవలే వార్తలొచ్చాయి.

పెళ్లి త‌ర్వాత తమన్నా అమెరికాలోనే త‌మ‌న్నా స్థిర‌ప‌డుతుంద‌ని కూడా పేర్కొన్నారు. ఐతే ఈ వార్తల్ని తమన్నా ఖండించింది. ఈ మేరకు ఆగ్రహంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది. దాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది.

‘‘ఒక రోజు నటుడు, మరొకరోజు క్రికెటర్‌, ఇప్పుడేమో డాక్టర్‌.. నేనేమీ భర్తల షాపింగ్‌ చేయటం లేదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిరాధారమైన వార్తలను సహించే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. నా తల్లిదండ్రులు కూడా పెళ్లి ఆలోచనల్లో లేరు. ప్రేమను ప్రేమిస్తా కానీ ఇలాంటి పుకార్లను కాదు. సినిమాలతో బిజీగా ఉన్నాను. దాంతోనే ఇప్పుడు ప్రేమలో ఉన్నా. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం గౌరవప్రదం కాదు. నా పెళ్లి గురించి ఏదైనా వార్త ఉంటే నేనే అభిమానులతో పంచుకుంటా. ఎవరి ఊహల నుంచో ఈ వార్తలు పుడుతున్నాయి. ఈ వార్తలు పుడుతున్న సమయంలో నేను సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నా’’ అని ఆమె అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు