చరణ్ 15.. మహేష్ 6

చరణ్ 15.. మహేష్ 6

శత దినోత్సవాలనే మాటనే పూర్తిగా మరిచిపోయిన ఈ రోజుల్లో కొన్ని సినిమాలు ఈ అరుదైన ఘనత సాధిస్తున్నాయి. ఈ వేసవి ఆరంభంలో వచ్చిన రామ్ చరణ్-సుకుమార్‌ల సినిమా ‘రంగస్థలం’ 15 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుని ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాకు చెప్పుకోదగ్గ సంఖ్యలో 100 రోజుల కేంద్రాలు పడ్డాయి. ‘రంగస్థలం’ తర్వాత వచ్చిన భారీ చిత్రం ‘భరత్ అనే నేను’ ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది.

ఈ ఆరు సెంటర్లూ ఆంధ్రాలోనివే కావడం విశేషం. విజయవాడ (కాపర్తి), తిరుపతి (విఖ్యాత్), తెనాలి (స్వరాజ్), చిలకలూరి పేట (కళామందిర్), కాకినాడ (అంజని), రాజమండ్రి (అశోక) సెంటర్లలో ఈ చిత్రం వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది.

‘రంగస్థలం’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా.. దాని పోటీని.. తర్వాత వచ్చిన సినిమాల పోటీని తట్టుకుని ఈ స్థాయిలో ఆడటం గొప్ప విషయమే. ఈ చిత్రం దాదాపు రూ.100 కోట్ల షేర్ సాధించి మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కొరటాల శివ-మహేష్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘శ్రీమంతుడు’ అప్పటికి నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టి భారీ విజయాన్నందుకుంది.

‘భరత్ అనే నేను’ ఆ స్థాయిలో కాకపోయినా పెద్ద సక్సెసే అయింది. రెండు భారీ డిజాస్టర్ల తర్వాత దక్కిన ఈ విజయంతో మహేష్‌కు గొప్ప ఉపశమనం లభించింది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించాడు. కియారా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు