మహాలక్ష్మి మురిపించేస్తోందిగా

మహాలక్ష్మి మురిపించేస్తోందిగా

మిల్కీ బ్యూటీ తమన్నాకు ఇప్పటికీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఆమెకు పేరు తెచ్చే క్యారెక్టర్లు మాత్రం పెద్దగా రావడం లేదు. బాహుబలి-1లో అవంతిక పాత్రలో జనాలకు బాగా నోటిఫై అయింది. ఆ తరవాత చేసిన సినిమాల వల్ల ఆమె నటించిన చిత్రాల సంఖ్య పెరిగింది ఇమేజ్ ఏ కొంచెమూ పెరగలేదు.

అప్పట్లో నాగచైతన్య హీరోగా నటించిన 100 % లవ్ లో బావతో దటీజ్ మహాలక్ష్మి అనిపించుకోవాలని తపన పడే మరదలిగా తమన్నా యాక్టింగ్ అదరగొట్టేసింది. మళ్లీ ఇన్నాళ్ల తరవాత అదే టైటిల్ మరోసారి ఆ రేంజిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ లో కంగన రనౌత్ హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ మూవీ క్వీన్ కు అఫీషియల్ రీమేక్ గా దటీజ్ మహాలక్ష్మి సినిమా వస్తోంది. క్వీన్ సినిమాను తమిళంలోనూ రీమేక్ చేస్తున్నారు. పారిస్.. పారిస్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే కాజల్ కన్నా ఈ రోల్ లో తమన్నాయే ఇంప్రెసివ్ గా కనిపిస్తోంది.

ఈమధ్య తమన్నా కాస్త చిక్కిందేమో చూడటానికి క్యూట్ గా కనిపిస్తోంది. ఈ స్టిల్స్ లో నిజంగానే దటీజ్ తమన్నా అనిపిస్తోంది. దటీజ్ మహాలక్ష్మి ఫారిన్ షూటింగ్ మొత్తం పూర్తి కావచ్చింది. అక్టోబరులో ఈ మూవీని థియేటర్లకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. దటీజ్ మహాలక్ష్మి సినిమా డైరెక్షన్ బాధ్యతలు మొదట మిస్సమ్మ ఫేం డైరెక్టర్ నీలకంఠ తీసుకున్నాడు. తరవాత అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో నాని నిర్మించిన అ! సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్టర్ సీట్ లో కూర్చుని ఈ సినిమా పూర్తి చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు