సైరాలో రత్నవేలు సాహసం

సైరాలో రత్నవేలు సాహసం

మెగాస్టార్ చిరంజీవి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న చిత్రం సైరా.. నరసింహారెడ్డి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  కథతో ఈ సినిమా తీస్తున్నారు. భారీ కాస్టింగ్ తో.. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

సైరా.. సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నాడు. చారిత్రక సినిమాలకు సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. అందుకే సైరా నిర్మాత రామ్ చరణ్ తేజ్ ఈ మూవీకి రత్నవేలును ఏరికోరి సినిమాటోగ్రాఫర్ గా పెట్టుకున్నాడు. ఈ సినిమాకు పనిచేయడం ఛాలెంజింగ్ కావడంతో రత్నవేలు కూడా ఉత్సాహంగానే ఉన్నాడు. 35 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ ఈ మధ్యనే పూర్తి చేశారు. వాన.. బ్రిటిష్ సేన.. మందుగుండు పేలుళ్ల మధ్య ఓ మాసివ్ యాక్షన్ ఈ మధ్యనే చిత్రీకరించారు. అతి తక్కువ లైట్ లో.. హైటెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ సన్నివేశాలు పూర్తి చేశామని అంటున్నాడు రత్నవేలు. ఒక్కమాటలో చెప్పాలంటే సైరా.. అద్భుతం అనే అనేశాడు. సక్సెస ఫుల్ గా 35 రోజుల ఛాలెంజింగ్ షెడ్యూల్ పూర్తి చేశామంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

సైరా మూవీలో చిరుకు హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. నరసింహారెడ్డి గురువు పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించాడు. తెలుగు - తమిళం - హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English