అభిమానులూ కాస్త ఆగండి -అల్లు అర్జున్

అభిమానులూ కాస్త ఆగండి -అల్లు అర్జున్

దువ్వాడ జగన్నాథమ్.. నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా సినిమాలతో వరసగా రెండు ఫ్లాపులు ఫేస్ చేశాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. క్యారెక్టర్లలో కొత్తదనం చూపించాలన్న తాపత్రయంతో ఈ రెండు సినిమాల కోసం బన్నీ ఎంతో శ్రమించాడు. సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రశంసలు వచ్చాయి తప్ప కలెక్షన్లు మాత్రం రాలేదు.

అల్లు అర్జున్ తరవాత సినిమా ఏంటన్న దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీనిపై ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. వాటిపై బన్నీయే స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు.  తన నెక్ట్స్ ప్రాజెక్టు ఏంటనేది ఇంకా తేల్చుకోలేదంటూ ట్విట్టర్ టైమ్ లైన్ లో పెట్టాడు. ‘‘నా ప్రియమైన అభిమానులారా. మీ ప్రేమకు కృతజ్ఞతలు. నా తరవాత మూవీ అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఇంకొంతకాలం సహనంగా వేచి ఉండమని కోరుకుంటున్నా. ఎందుకంటే దానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఓ మంచి సినిమా చేయాలని అనుకుంటున్నా. కొంతకాలం పడుతుంది. అర్ధం చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ తన మనసులోని మాటకు అక్షర రూపమిచ్చాడు.

దువ్వాడ జగన్నాథమ్ - నాపేరు సూర్య సబ్జెక్టులతో బన్నీ ఎంతగానో నమ్మాడు. కానీ ఆ సినిమాలు రెండూ అతడి అంచనాలను దెబ్బకొట్టాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపనతో ఉన్నాడు. బన్నీతో పని చేయాలని అనుకుంటున్న డైరెక్టర్ల లిస్ట్ పెద్దదే ఉంది. కానీ వాళ్లంతా ప్రస్తుతం వేరే కమిట్ మెంట్స్ లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ముందుగా నటించే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు