పెళ్లి చేసుకొని సినిమాలు మానేస్తా

పెళ్లి చేసుకొని సినిమాలు మానేస్తా

సినిమాల్లో ఆమె ఎంట్రీనే ఒక సంచ‌ల‌నం. మెగా ఫ్యామిలీ నుంచి హీరోలే కానీ హీరోయిన్లు రారన్న మాట‌కు భిన్నంగా.. ఇంట్లో వారిని ఒప్పించి మ‌రీ మూవీస్ చేస్తోంది నిహారిక‌.  ఆచితూచి అన్న‌ట్లుగా పాత్ర‌ల్ని ఎంపిక చేసుకొని మ‌రీ సినిమాలు తీస్తున్న ఆమె.. తాజాగా హ్యాపి వెడ్డింగ్ లో చేసింది. అక్ష‌ర అనే సింఫుల్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ పాత్ర‌లో ఆమె క‌నిపిస్తోంది.

ఈ మూవీలో త‌న పాత్ర బాగుంటుంద‌న్న ఆమె.. త‌న కెరీర్ కు సంబంధించి తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. త‌న‌కు ప‌ది.. ప‌దిహేనేళ్లు సినిమాల్లో న‌టించాల‌ని లేద‌ని.. మూడు.. నాలుగేళ్ల త‌ర్వాత పెళ్లి చేసుకొని సినిమాలు మానేస్తాన‌ని చెప్పింది. అయితే.. సినిమా రంగం నుంచి దూరం కాన‌న్న నిహారిక‌.. తాను ప్రొడ‌క్ష‌న్ వైపు ఉంటాన‌ని స్ప‌ష్టం చేసింది. వెబ్ సిరీస్ లు చేసుకుంటాన‌ని పేర్కొంది.

మెగాస్టార్ డ్యాన్స్ చిన్న‌త‌నం నుంచి చూస్తూ పెర‌గ‌టం వ‌ల్ల నేర్చుకోవాల్సిన ప‌ని లేద‌నిపించింద‌ని.. డ్యాన్స్ బాగా వ‌చ్చిన‌ప్ప‌టికీ గ‌డిచిన మూడు సినిమాల్లో చేసే అవ‌కావం రాలేద‌న్నారు. క్లాసిక‌ల్ డ్యాన్స్ నేర్చుకునే క్ర‌మంలో కాళ్ల‌పై కొట్టి నేర్పిస్తార‌ని.. అలా చేయ‌టంతో జ్వ‌రం వ‌చ్చి నేర్చుకోవ‌ట‌మే మానేసిన‌ట్లు నిహారిక చెప్పింది.

తాను సినిమాల్లో న‌టించ‌టం మానేసిన త‌ర్వాత కూడా త‌న సినిమాలు చూసుకుంటే.. త‌న ప్ర‌తి క్యారెక్ట‌ర్ త‌న‌కు న‌చ్చాల‌ని తాను అనుకుంటాన‌ని చెప్పింది. స్టార్ హీరోల‌తో త‌న‌కు న‌టించే అవకాశం ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌ని చెప్పింది. ఆయ్‌.. మెగా అమ్మాయికి స్టార్ హీరోలు ఛాన్సులు ఇవ్వ‌క‌పోవ‌టం ఏంటి..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English