ఆరాటపడని మనసు!!

ఆరాటపడని మనసు!!

ఆర్టిస్టిక్ టచ్ ఉండేలా ప్రేమకథా చిత్రాలను తీయడంలో డైరెక్టర్ హను రాఘవపూడి స్పెషలిస్టు. అతడు డైరెక్ట్ చేసిన అందాల రాక్షసి.. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాల్లో లవ్ స్టోరీ ఆడియన్స్ కు తెగనచ్చేసింది. ఇప్పుడీ డైరెక్టర్ యంగ్ హీరో శర్వానంద్ - టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టెయినర్ పడిపడిలేచే మనసు తీస్తున్నాడు.

పడిపడిలేచే మనసు వర్కింగ్ స్టిల్స్ లో శర్వా - సాయిపల్లవి జంట సూపర్బ్ అనిపించేలా ఉంది. ఈ సినిమాకు తక్కువ టైంలో మంచి బజ్ వచ్చింది. ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేయడానికి ఫిలిం మేకర్లు డిసైడయ్యారు. డిసెంబరు 21 డేట్ లాక్ చేశారు. నిజానికి పడిపడి లేచే మనసు షూటింగ్ చాలావరకు పూర్తయిపోయింది. ఇందులో ఎక్కువ పార్ట్ కలకత్తాలో తీశారు. ఇంకా నేపాల్ లో ఒక్క షెడ్యూల్ మాత్రం కంప్లీట్ చేయాల్సి ఉంది. సినిమా కంప్లీట్ అయిపోవస్తే పని చకచకా పూర్తి చేసి తొందరగా రిలీజ్ చేయలని ప్లాన్ చేస్తారు.

పడిపడి లేచే మనసు టీం మొత్తం ఆరాటపడటం ఎందుకు అనుకుందో ఏమో కానీ నిదానంగానే పని పూర్తి చేయడానికి డిసైడ్ అయింది. ఈ మూవీలో సాయిపల్లవి.. శర్వాల క్యారెక్టర్లే హైలైట్ గా నిలుస్తాయని..  ఈ ప్రేమకథను ఓ దృశ్యకావ్యం రేంజిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది డైరెక్టర్ హను ఆలోచనగా ఉందని తెలుస్తోంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కు బోలెడంత టైం చేతిలో ఉంచుకున్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు