దేవరకొండ.. చెన్నైలోనూ రచ్చే

దేవరకొండ.. చెన్నైలోనూ రచ్చే

‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. తమిళనాట సైతం అతడికి మంచి క్రేజే ఉందన్న సంగతి తాజాగా రుజువైంది. తమిళ ఫిలిం సెలబ్రెటీలు ప్రతిష్టాత్మకంగా భావించే బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్స్ కార్యక్రమంలో అవార్డు అందుకున్న సందర్భంగా భారీ ఆడిటోరియం హోరెత్తిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా తమిళ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. భారీ స్థాయిలో జరిగిన ఈ వేడుకకు మన ఇండస్ట్రీ నుంచి రాజమౌళితో పాటు పలువురు హాజరయ్యారు. విజయ్‌కి దక్షిణాది సెన్సేషన్ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకోవడం కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి వేదిక మీదికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆడిటోరియం హోరెత్తింది. అతడికి సెలబ్రెటీలు.. సాధారణ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అవార్డు అందుకున్న అనంతరం విజయ్ తమిళంలో మాట్లాడటం విశేషం. అతను ఇప్పటికే ‘నోటా’ అనే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం తమిళం నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఈ అనుభవంతో అతను తమిళంలో మాట్లాడాడు. తమిళంలో అందరికి నమస్కారం చెప్పి.. తన తెలుగు సినిమాను ఇంత బాగా ఆదరించిన తమిళ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. కెరీర్లో ఇంత త్వరగా ద్విభాషా చిత్రంలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని.. ‘నోటా’ కూడా ఆకట్టుకుంటుందని.. వచ్చే ఏడాది కూడా తాను ఇదే వేడుకలో దక్షిణాది సెన్సేషన్ అవార్డును తీసుకుంటానని అన్నాడు. సదర్న్ సెన్సేషన్ అనే మాటకు తాను అసలైన నిదర్శనమని.. అందుకు తగ్గట్లుగా తాను నడుచుకుంటానని విజయ్ పేర్కొనడం గమనార్హం. ప్రసంగానంతరం విజయ్ చేసిన ర్యాంప్ వాక్‌కు కూడా మంచి రెస్పాన్స వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు