అఫీషియల్.. చిరు సినిమాలో నిహారిక

అఫీషియల్.. చిరు సినిమాలో నిహారిక

మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని బయటి నటీనటులే కాదు.. మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లు కూడా ఎంతో కోరుకుంటారనడంలో సందేహం లేదు. ఐతే ఆ అవకాశం చాలా తక్కువమందికే లభించింది. నాగబాబు.. పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ మాత్రమే కాసేపైనా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఐతే వీళ్ల తర్వాత కూడా చాలామందే మెగా ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేశారు. సాయిధరమ్ తేజ్.. వరుణ్ తేజ్.. అల్లు శిరీష్.. నిహారిక.. వీళ్లందరికీ చిరుతో నటించాలన్న కోరిక ఉంది. కానీ తనకంటే ముందు వచ్చిన వాళ్ల కంటే ముందు నిహారిక చిరుతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేయడం విశేషం. చిరు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా’ సినిమాలో నిహారిక కూడా కనిపించబోతోంది. ఈ విషయం అధికారికంగా ధ్రువీకరణ అయింది.

‘సైరా’లో నిహారిక అంటూ కొన్ని రోజుల కిందటే ప్రచారం జరగ్గా అది జస్ట్ రూమర్ అనుకున్నారు. కానీ తాను ఆ చిత్రంలో నటిస్తున్న మాట నిజమంటూ తన కొత్త సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’ ప్రమోషన్లలో భాగంగా నిహారికే స్వయంగా చెప్పింది. పెదనాన్నతో కలిసి నటించాలన్నది తన కల అని.. అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదని నిహారిక చెప్పింది. ‘సైరా’లో తాను ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్లు వెల్లడించింది. కానీ తన పాత్ర ఎంతో సేపు ఉండదని.. రెండు మూడు సన్నివేశాలకే పరిమితం అని.. అలా అయినప్పటికీ మెగాస్టార్ తో కలిసి నటించడం గొప్ప అవకాశమని నిహారిక చెప్పింది. బహుశా నిహారిక ఒక ఎగ్జైట్మంట్లో ఈ విషయాన్ని అనుకోకుండా వెల్లడించేసి ఉండొచ్చు. ఇలాంటి విషయాలు దాచిపెట్టి సినిమాలో సర్ప్రైజ్ చేస్తే బాగుండేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English