మారుతి సినిమా పచ్చడయ్యేలా ఉందే

మారుతి సినిమా పచ్చడయ్యేలా ఉందే

ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా పట్ల ప్రేక్షకులు ఆకర్షితులు కావాలంటే.. థియేటర్లకు రావాలంటే.. ప్రోమోలనేవి చాలా కీలకం. టీజర్.. ట్రైలర్ కొత్తగా.. ఆసక్తికరంగా ఉంటే ఆటోమేటిగ్గా ఆ సినిమాకు క్రేజ్ వస్తుంది. మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఈ మధ్య విడులైన ‘ఆర్ఎక్స్ 100’ కేవలం ప్రోమోలతోనే ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఐతే మారుతి రచనతో.. అతడి సమర్పణతో తెరకెక్కిన చిన్న సినిమా ‘బ్రాండ్ బాబు’ ఆ రకమైన ఆసక్తిని రేకెత్తించడంలో విఫలమైంది.

 బ్రాండ్లంటే పడి చచ్చే ఒక బడా బాబు.. ఒక పని మనిషితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ లైన్ ఆసక్తికరంగానే అనిపిస్తోంది. ఫన్ వర్కవుట్ చేయడానికి మంచి స్కోపే ఉంది. మరోవైపు ఈ సినిమా రిలీజయ్యే ఆగస్టు 3న గట్టి పోటీ నెలకొంది. ఆ రోజు కొత్తదనం ఉన్న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి.. గూఢచారి. అడివి శేష్ హీరోగా అతడి కథతోనే తెరకెక్కిన ‘గూఢచారి’ హాలీవుడ్ స్థాయి థ్రిల్లర్లా కనిపిస్తోంది.

ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తెచ్చింది. ఇక సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ రూపొందించిన ‘చి ల సౌ’ కూడా అదే రోజు రానుంది. దీని టీజర్లు కూడా కొత్తగా.. భలేగా అనిపించాయి. పైగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని టేకప్ చేసి రిలీజ్ చేస్తోంది. ఇది సుశాంత్ కు తొలి విజయాన్నందిస్తుందన్న అంచనాలున్నాయి. కొత్తగా కనిపిస్తున్న ఈ రెండు సినిమాల మధ్య.. రొటీన్ గా ఉన్న ‘బ్రాండ్ బాబు’ పచ్చడైపోతుందేమో అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు