'బిగ్‌బాస్‌' తేజస్విది అమాయకత్వమా, మూర్ఖత్వమా!

'బిగ్‌బాస్‌' తేజస్విది అమాయకత్వమా, మూర్ఖత్వమా!

బిగ్‌బాస్‌ షోతో రెండు రకాలుగా పాపులర్‌ అవ్వవచ్చు. జనాన్ని ఎంటర్‌టైన్‌ చేసి వారి మెప్పుని పొందవచ్చు లేదా వారిని చిరాకు పెట్టి నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకోవచ్చు. ఈ రెండో దారిని ఎంచుకుంది నటి తేజస్వి. ఒకటీ అరా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి, పలు చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ చేసిన తేజస్వి పాపులరే. తనకంటూ ఒక నీట్‌ ఇమేజ్‌ వుందిన్నాళ్లు. కానీ బిగ్‌బాస్‌లోకి వచ్చి తనకున్న మంచి పేరు మొత్తం పోగొట్టుకుంది. హౌస్‌లో పలు వివాదాలకి కారణమై అర్ధాంతరంగా షో నుంచి నిష్క్రమించింది.

బయటకి వచ్చేసాక తనపై వున్న బ్యాడ్‌ టాక్‌ ఏమిటనేది తెలుసుకున్న తేజస్వి దానిని కరక్ట్‌ చేసుకోవడానికి బదులు తనని తాను సమర్ధించుకునే పని మొదలు పెట్టింది. ఇష్టానికి బూతులు మాట్లాడుతూ, హౌస్‌లో అందరితో అగౌరవంగా ప్రవర్తించిన తేజస్వి విక్టిమ్‌ కార్డ్‌ ప్లే చేస్తోంది. బిగ్‌బాస్‌ తనని రాంగ్‌గా చూపించిందంటూ ఎడిటర్లని నిందిస్తోంది. అంతటితో ఆగకుండా తాను చదువుకున్న దాన్నని, ఇంగ్లీష్‌ చాలా బాగా మాట్లాడతానని, ఆ షో చూసే వాళ్లు కూడా ఎడ్యుకేటెడ్‌ అయి వుంటారని వాళ్లకి నచ్చేలా ప్రవర్తించానని, కానీ ఇది బి, సి సెంటర్స్‌ వాళ్లు చూసే షో అని ఇప్పుడు తెలిసిందని, అందుకని మళ్లీ హౌస్‌లోకి వెళితే వీరికి నచ్చే విధంగా నడుచుకుంటానని వ్యంగ్యంగా మాట్లాడుతోంది. ఇలాంటి వ్యాఖ్యలతో ఇప్పటికే తనపై వున్న నెగెటివిటీ మరీ ఎక్కువ అవుతోంది.

తన నోటి వల్ల తన క్యారెక్టర్‌కి, ఇమేజ్‌కి జరుగుతోన్న డ్యామేజ్‌ కూడా తేజస్వి గుర్తించలేకపోతోంది. తన ప్రవర్తన వల్ల వచ్చిన హేట్‌ని కూడా ఆమె అర్థం చేసుకోలేక, దానిని కరక్ట్‌ చేసుకోలేక తేజస్వి టీవీ ఇంటర్వ్యూల ద్వారా తన పతనానికి తానే కారకురాలవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English