నిహారిక కొణిదెలలో ఆ కోణం మిస్సింగా?

నిహారిక కొణిదెలలో ఆ కోణం మిస్సింగా?

నిహారిక కొణిదెల హీరోయిన్‌ అవుతోందంటే ఆమెని ఇష్టపడే వాళ్లు ఎక్సయిట్‌ అయ్యారు. ఢీ హోస్ట్‌గా ఆమె చూపిన చలాకీతనంకి తోడు జబర్దస్త్‌ని అనుకరిస్తూ ఆమె చేసిన సందడి చాలా మందిని ఆకట్టుకుంది. అలాగే వెబ్‌ సిరీస్‌లలో కూడా చలాకీ పాత్రల్లోనే కనిపించిన నిహారిక వెండితెరపై కూడా అలాంటి అల్లరి పాత్రలే చేస్తుందని భావించారు.

అష్టాచమ్మాలో కలర్స్‌ స్వాతి చేసిన క్యారెక్టర్‌ తరహా పాత్రలు ఎంచుకుని నటిగా తన ఐడెంటిటీ నిలుపుకుంటుందని అనుకుంటే ఆమె మొదటి సినిమాలోనే ఏడుపుగొట్టు పాత్ర చేసి ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా గౌరవప్రదమైన ఇమేజ్‌ తెచ్చుకోవాలనే ఆలోచనతో నిహారిక తనకి సూట్‌ కాని పెద్ద తరహా పాత్రలు ఎంచుకుంటోందా అనిపిస్తోంది.

'హ్యాపీ వెడ్డింగ్‌' ప్రమోషన్స్‌లో భాగంగా తన అన్నయ్య రామ్‌ చరణ్‌ని అనుకరిస్తూ ఆమె అందరినీ నవ్వించినది చూసి తనకి ఇలాంటి లైవ్లీ పాత్రలు ఎందుకు ఇవ్వడం లేదా అని సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్‌ అంటే గ్లామరస్‌గానో లేదా పూర్తిగా ట్రాజెడీ పాత్రలతోనో కనిపించాల్సిన పని లేదు. సరదాగా, బబ్లీగా వుండే పాత్రలు ఎంచుకున్నా నిహారిక తన టాలెంట్‌ని పూర్తిగా వినియోగించుకునే వీలు చిక్కుతుంది. పనిలో పనిగా అభిమానుల్ని కూడా సంపాదించుకోగలుగుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English