కొడుకులు దిద్దుతున్న కాపురం

కొడుకులు దిద్దుతున్న కాపురం

ఒకసారి విడిపోయిన జంట తిరిగి కలవడం అనేది సినిమాల్లో సూపర్ హిట్ ఫార్ములా. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నిజజీవితంలో ఇలా జరగడం అరుదు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ విషయంలో మాత్రం ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తోంది. రీల్ లైఫ్ కు ఏ మాత్రం తీసిపోని ట్విస్టులతో అతడి లవ్ స్టోరీ సాగుతోంది.

తాను చిన్ననాటి నుంచే ప్రేమించిన సుసానే ఖాన్ ను 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా ఒకరుగా ఉన్న వీళ్లు హఠాత్తుగా విడిపోవడం బాలీవుడ్ జనాలను ఆశ్చర్యపరిచింది. విడిపోయే నాటికి వీళ్లకు హ్రీహాన్.. హ్రీదాన్ అనే ఇద్దరు కొడుకులున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా హృతిక్ - సుసానే తన స్నేహబంధాన్ని కొనసాగించారు. తల్లిదండ్రులుగా పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. వీలున్నప్పుడల్లా పిల్లలను ఫారిన్ టూర్లకు షికార్లకు తీసుకెళుతూనే ఉండేవాడు హృతిక్.

సుసానేతో విడిపోవడం తాను చేసిన పెద్ద తప్పుల్లో ఒకటని ఆమధ్య హృతిక్ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. పిల్లల పెంపకంలో వీళ్లిద్దరూ తమ తప్పులేంటో తీసుకున్నారు. వాళ్లకోసం తిరిగి ఒకటవ్వాలని హృతిక్ - సుసానే అనుకుంటున్నారట. పాత గొడవలకు గుడ్ బై చెప్పేసి రేపోమాపో మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారనేది బాలీవుడ్ టాక్.  వాళ్లిద్దరూ తిరిగి జంటగా కలిసి జీవించాని ఫ్యాన్స్ సైతం ఆశపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు