చికాగో రాకెట్ చిక్కులు తెచ్చిపెట్టిందిగా..

చికాగో రాకెట్ చిక్కులు తెచ్చిపెట్టిందిగా..

అమెరికా అంటే భూతల స్వర్గం. ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం. వీటన్నింటికి మించి ఎంతో అభివృద్ధి చెందిన దేశం. అందుకే టాలీవుడ్ లోని ఎన్నో సినిమాలు అమెరికాలో తీశారు. సీమ సందుల్లో కథ నడిచినా పాటలు అమెరికాలో తీయడం అలవాటుగా చేసుకున్నారు. సినిమా షూటింగ్ కోసమంటే అమెరికా వీసా కూడా అలవోకగా వచ్చేసిది.

కానీ చికాగో లో సెక్స్ రాకెట్ బయటపడ్డాక పరిస్థితి మొత్తం మారిపోయింది. కల్చరల్ ప్రోగ్రామ్స్ పేరిట హీరోయిన్లను ఆహ్వానించి వాళ్లతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న విషయాన్ని యూఎస్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇప్పుడు షూటింగ్ కోసం అమెరికా వీసా అంటే కష్టమనే మాటే వినిపిస్తోంది. ఒకవేళ వెళ్లినా ఎందుకొచ్చారు... ఎలా వచ్చారు.. ఎక్కడికెళ్తారు అంటూ సవాలక్ష ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. తప్పు చేసిన వాళ్లలా తమను ట్రీట్ చేస్తుండటాన్ని హీరోయిన్లు అస్సలు సహించలేక పోతున్నారు. ఈమధ్య మెహ్రీన్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాస్త పేరు.. ఫేమ్ ఉన్నవాళ్లకయితే కొంచెం కష్టమైనా వీసాలొస్తున్నాయి కానీ కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వాళ్లకు మాత్రం యూఎస్ అఫీషియల్స్ చుక్కలు చూపించేస్తున్నారు.

దీంతో నిర్మాతలు.. దర్శకులు పద్ధతి మార్చేశారు. యూఎస్ బదులు యూకే ఛలో అంటున్నారు. ముఖ్యంగా లండన్ ఇప్పుడు టాలీవుడ్ షూటింగులకు హాట్ స్పాట్ గా మారింది. హీరో అఖిల్ తో తొలిప్రేమ ఫేం డైరెక్టర్ వెంకీ అట్లూరి తీస్తున్న మూవీ... సందీప్ కిషన్ - తమన్నా కాంబినేషన్ లో వస్తున్న మూవీ లండన్ లోనే తీయాలని ప్లాన్ చేస్తున్నారు. రాజశేఖర్ కూతురు శివాని - అడవి శేష్ జంటగా నటిస్తున్న 2 స్టేట్స్ షూటింగ్ కు యూఎస్ వీసా రాకపోతే లండన్ కు వెళ్లేలా ప్లానింగ్ రెడీ చేసి ఉంచుకున్నారు. అమెరికా వెళ్లి ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేసేకన్నా యూకే.. స్విట్టర్లాండ్.. యూరోపియన్ కంట్రీస్ కు వెళ్లడం బెస్టని ఇండస్ట్రీలో ఎక్కువమంది భావిస్తున్నారని ఓ మేనేజర్ చెప్పుకొచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు