అప్పుడు ప్రేమలో.. ఈసారి రేసులో..

అప్పుడు ప్రేమలో.. ఈసారి రేసులో..

ఫిదా సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్..  సాయి పల్లవికి తెలుగులో బిక్ బ్రేక్ వచ్చింది. తక్కువ అంచనా మధ్య రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐగా.. తెలంగాణ అమ్మాయిగా సాయిపల్లవి అదరగొట్టేశారు. ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ ఇమేజ్ పెరగ్గా.. సాయిపల్లవికి స్టార్ హీరోయన్ రేంజ్ గుర్తింపు వచ్చేసింది.

ఫిదా సినిమాలో ముచ్చటగా కనిపించిన జంట ఈసారి ఒకరితో ఒకరు రేస్ కు రెడీ అయిపోతున్నారు. అది పర్సనల్ గా కాదు.. సినిమాపరంగానే. సాయిపల్లవి ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి పడిపడి లేచే మనసు సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది క్రిస్మస్ నాటికి థియేటర్లకు రానుంది. ఇదేటైంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీ కూడా దాదాపుగా అదే టైంకు థియేటర్లకు వస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ రెండు సినిమాలపైనా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

సున్నితమైన ప్రేమకథలను అందంగా తెరకెక్కిస్తాడనే పేరున్న హను రాఘవపూడి పడిపడి లేచే మనసు సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ కావడంతో యూత్ కనెక్టయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వరుణ్ తేజ్ చేస్తున్న మూవీ అంతరిక్షం నేపథ్యంగా వస్తోంది. ఓ రకంగా ఇది తెలుగులో ఎవరూ టచ్ చేయని సబ్జెక్టు. ఘాజీలాంటి డిఫరెంట్ సినిమాతో మెప్పించిన సంకల్ఫ్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండటం ఈ మూవీపై బజ్ పెంచుతోంది. క్రిస్మస్ రేసులో వీళ్లిద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English