అప్పుడే ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి

అప్పుడే ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి

ఇతర భాషల అమ్మాయిలతో పోలిస్తే టాలీవుడ్ లో రాణించే తెలుగమ్మాయిలు తక్కువే. ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న తెలుగమ్మాయిల్లో ఈషా రెబ్బా పేరు ముందుంటుంది. క్లీన్ ఎంటర్ టెయినర్స్ తో పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలతో ఈ సుందరి లైమ్ లైట్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈషా రెబ్బా కెరీర్ మంచి జోరుమీదుంది.

ఈషా హీరోయిన్ గా నటించిన బ్రాండ్ బాబు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆగస్టు 3న ఈ మూవీ థియేటర్లకు రానుంది. ఇందులో కెరీర్ లో తొలిసారి ఈషా పని మనిషి పాత్ర చేస్తోంది. అర్ధం చేసుకునేది తక్కువ.. అపార్ధం చేసుకునేది  ఎక్కువగా ఆమె ఈ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా హోం వర్క్ కూడా చేసిందట. అంటే ఇంట్లో పనిమనిషి ఎలా పనిచేస్తుందనేది ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అబ్జర్వ్ చేశానని చెబుతోంది. కెరీర్ లో తనకు డబ్బొక్కటే ఇంపార్టెంట్ కాదంటోంది ఈషా.  ‘‘సినిమాలో సబ్జెక్టు బాగుండాలి. నేను బాగా నటించానని అనిపిస్తేనే కదా డైరెక్టర్లు.. నిర్మాతలు నన్ను వెతుక్కుంటూ వస్తారు. నాకు స్టోరీస్ వినడం అంటే చాలా ఇష్టం. ఒక స్టోరీకి కనెక్ట్ అయ్యానే వెంటనే ఓకే చెప్పేస్తా అంటోంది ఈషా.

టీవీ సీరియళ్లతో పేరు తెచ్చుకున్న ప్రభాకర్ డైరెక్షన్ లో బ్రాండ్ బాండు సినిమా తెరకెక్కింది. కన్నడ హీరో సుమంత్ శైలేంద్ర ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. దీంతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఈషా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు