టాలీవుడ్‌కి బ్రాండ్‌ బాబు అతడే

టాలీవుడ్‌కి బ్రాండ్‌ బాబు అతడే

'బ్రాండ్‌ బాబు' చిత్రాన్ని మామూలుగా అయితే ఎక్కువమంది పట్టించుకునే వారు కాదేమో కానీ మారుతి పేరు అసోసియేట్‌ అవడం వల్ల ఈ చిత్రంపై కాస్త ఆసక్తి కలుగుతోంది. ఈజీగా రిలేట్‌ చేసుకునే పాత్రలతో సరదా కథలు రాయడం మారుతికి అలవాటు. బ్రాండ్‌ బాబు చిత్రంపై మారుతి ముద్ర అయితే బలంగా కనిపిస్తోంది. పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు అన్నీ మారుతి ట్రేడ్‌మార్క్‌కి తగ్గట్టే వున్నాయి.

ఈ చిత్రానికి కథ ఇవ్వడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న మారుతికి కథకి గాను కోటి రూపాయలు దక్కాయట. అది కాకుండా సినిమాకి కనుక లాభాలు వస్తే అందులో టెన్‌ పర్సెంట్‌ రాయల్టీ కూడా అతనికి దక్కుతుందట. భలే భలే మగాడివోయ్‌, మహానుభావుడు లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న మారుతికి ట్రేడ్‌లోను మంచి గుడ్‌ విల్‌ వుంది.

ఈ రోజుల్లో, ప్రేమకథాచిత్రమ్‌ నాటి నుంచే అతని పేరు మార్కెట్‌లో బాగా సేల్‌ అవుతుంది. అందుకే తన పేరుకున్న సేలబులిటీని మారుతి క్యాష్‌ చేసుకుంటున్నాడు. బ్రాండ్‌ నేమ్‌ని ఇంతగా క్యాష్‌ చేసుకునే వాళ్లు తెలుగు చిత్రసీమలో మరెవరూ లేరని కూడా అతడి గురించి చెప్పుకుంటూ వుంటారు. అందుకే మారుతి కథ రాసిన సినిమా పేరు బ్రాండ్‌ బాబు అయినా, ఇండస్ట్రీలో మాత్రం ఆ పేరు తనకే పక్కాగా సూట్‌ అవుతుందంటూ జోక్స్‌ వేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు