మొత్తం ఆ హీరో కంట్రోల్‌లోనే

మొత్తం ఆ హీరో కంట్రోల్‌లోనే

'అర్జున్‌ రెడ్డి' చిత్రానికి అంతటి క్రేజ్‌ రావడంలో కీలక పాత్ర పోషించాడు విజయ్‌ దేవరకొండ. ఎలా మార్కెటింగ్‌ చేస్తే సినిమా వైరల్‌ అవుతుందనేది అతనికి తెలుసు. మార్కెటింగ్‌లో సిద్ధహస్తుడు కనుకే సొంతంగా రౌడీ బ్రాండ్‌ కూడా లాంఛ్‌ చేసేసాడు. తాజాగా 'గీత గోవిందం' చిత్రానికి కూడా ప్రమోషన్లు ఎలాగుండాలనేది విజయ్‌ తన కంట్రోల్‌లోకి తీసేసుకున్నాడు.

ఈ చిత్రాన్ని క్లాసీగా, ఫ్యామిలీ సినిమాగా ప్రమోట్‌ చేయాలని నిర్మాత, దర్శకుడు భావించారు. మొదటి పోస్టర్‌ అలాగే వదిలారు. అది చూసిన విజయ్‌ దేవరకొండ రంగంలోకి దిగి '25 ఇయర్స్‌ స్టిల్‌ వర్జిన్‌' పోస్టర్‌ని డిజైన్‌ చేయించి వదిలాడు. అంతే సినిమా కలరే మారిపోయింది. ఒక్కసారిగా యూత్‌ దృష్టి ఈ చిత్రం వైపు మరలింది. తన సినిమాలకి వచ్చేది యూత్‌ కనుక వారిని టార్గెట్‌ చేసేలా అన్నీ వుండాలని టీజర్‌ కూడా అలా తనే కట్‌ చేయించాడట. అతని ఐడియాలు బాగా నచ్చడంతో దర్శకుడు పరశురాం, నిర్మాత బన్నీ వాస్‌ కూడా ఏమీ అడ్డు చెప్పడం లేదట.

తాజాగా 'వాట్‌ ది ఎఫ్‌' అంటూ యూత్‌ని అమితంగా ఆకట్టుకునే లక్షణాలున్న పాటని విడుదల చేసారు. ఈ పాటకి హుక్‌ లైన్‌ ఇచ్చిందీ, ఇది సినిమాలో వుండాలని అడిగిందీ కూడా విజయేనట. మొత్తానికి యూత్‌ పల్స్‌ బాగా పట్టేసిన విజయ్‌ దేవరకొండతో సినిమా చేస్తే దానిని వైరల్‌గా ఎలా మార్చాలనేది అతనే చూసుకుంటాడు కనుక దర్శకులకి ఆ చింత తీరిపోతుందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు