హ్యాట్సాఫ్ సూర్య అండ్ ఫ్యామిలీ

హ్యాట్సాఫ్ సూర్య అండ్ ఫ్యామిలీ

తమిళ స్టార్ హీరో సూర్య.. అతడి కుటుంబ సభ్యులు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. తన తమ్ముడు కార్తి కథానాయకుడిగా రైతు కథతో ‘చినబాబు’ సినిమాను సూర్య నిర్మించిన సంగతి తెలిసిందే. దీని తమిళ వెర్షన్ ‘కడైకుట్టి సింగం’ తమిళనాట మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా విజయోవత్సవ వేడుకను నిర్వహించిన సూర్య కుటుంబం.. రైతుల్ని సత్కరించింది.

అంతే కాదు.. రైతు సంక్షేమం కోసం ఏకంగా కోటి రూపాయల విరాళం ప్రకటించింది. రైతులకు ఉపయోగపడేలా శాస్త్రీయ పరిశోధనలు జరిపేందుకు ఈ కోటి రూపాయలు వినియోగించనున్నారు. సూర్య కుటుంబం నడిపే ‘అగరం’ ఫౌండేషన్ ఈ పరిశోధన కార్యక్రమాల్ని పర్యవేక్షించనుంది. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తోంది.
 
‘అగరం’ పేరుతో చాలా ఏళ్ల కిందటే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది సూర్య కుటుంబం. వాళ్లు ఏటా కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపడతారు.  ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడే వందల మంది విద్యార్థులకు ఈ సంస్థ తరఫున సాయం చేస్తారు. అనాథల్ని కూడా అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పిస్తుంటారు. ఏదో ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం మొక్కుబడిగా నడిపే సంస్థల తరహాది కాదు ‘అగరం’ ఫౌండేషన్. ఆ సంస్థను సందర్శిస్తే సూర్య ఫ్యామిలీది ఎంత గొప్ప మనసో అర్థమవుతుంది. చెన్నైలోని ఖరీదైన ప్రాంతంలో సూర్య ఫ్యామిలీ ఎంతో కాలం నివసించిన పెద్ద ఇంటిని ఈ ఫౌండేషన్లోని పిల్లల కోసం ఉదారంగా ఇచ్చేయడం విశేషం. ఇప్పటికే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన ‘అగరం’ తరఫున మరింత మందికి సాయపడాలని సూర్య ఇటీవలే నిర్ణయించాడు.

ఏటా ఇకపై కొత్తగా 500 మంది కాలేజీ విద్యార్థులకు అండగా నిలుస్తామని ప్రకటించాడు. బాగా చదువుతూ ఉండి ఆర్థికంగా వెనుకబడిన 500 మంది ఎంపిక చేసి వారి చదువు.. ఇతర అవసరాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నాడు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న సూర్య కుటుంబానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English