శర్వా-సాయిపల్లవి వెనక్కి వెళ్లిపోయారు

శర్వా-సాయిపల్లవి వెనక్కి వెళ్లిపోయారు

శర్వానంద్-సాయిపల్లవి కాంబినేషన్లో యువ దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని దసరాకే విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ హను ఎప్పట్లాగే నెమ్మదిగా సినిమాను చెక్కుతుండటంతో దసరా డేట్ అందుకోవడం కష్టమని తేలిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కు వాయిదా వేశారు. డిసెంబరు 21న ‘పడి పడి లేచె మనసు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజే రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఒక ఆసక్తికర పోస్టర్ కూడా లాంచ్ చేశారు. శర్వా, సాయిపల్లవి వర్షంలో గొడుగు కిందికి చేరి చాలా రొమాంటిగ్గా కనిపిస్తున్నారు ఈ పోస్టర్లో. ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోల
మాదిరిగానే ఇది కూడా సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బేనర్ మీద సుధాకర్ చెరుకూరి.. ప్రసాదర్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకుముందు హను తీసిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కు సంగీతాన్నందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నాడు.

‘లై’ లాంటి డిజాస్టర్ తర్వాత హను తీస్తున్న సినిమా ఇది. ఈసారి తనేంటో రుజువు చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. దీంతో తనకు కలిసొచ్చిన లవ్ స్టోరీ జానర్‌ను ఎంచుకున్నాడు. శర్వా, సాయిపల్లవి లాంటి మంచి పెర్ఫామర్లు ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐతే తన గత సినిమాల కథానాయకులతో మాదిరే శర్వాతోనూ సాయిపల్లవి గొడవ పడిందన్న వార్తలు కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ నెగెటివ్ వార్తలకు చెక్ పెట్టేలా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ వదిలినట్లుంది చిత్ర బృందం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English