అబ్బబ్బ.. ఏం స్టెప్పులు! ఏం మెరుపులు!!

అబ్బబ్బ.. ఏం స్టెప్పులు! ఏం మెరుపులు!!

టీవీ షోల్లో యాంకరింగ్ కు కొత్త గ్లామర్ తీసుకొచ్చింది అనసూయ అండ్ రష్మీలే. జబర్దస్త్ షో క్లిక్కవడంలో ఈ సుందరీమణుల పాత్రను తీసిపారేయలేం. ఈ ఒక్క షోతో వీళ్లు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ గా పాపులరయ్యారు. ఓ రకంగా యాంకరింగ్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టారు.

రష్మి అనసూయ టీవీ షోలో కలిసి కనిపించారు కానీ వాళ్లిద్దరూ కలిసి స్టెప్పులు వేయడం ఎక్కడా చూడలేదు. ఈమధ్య ఈ భామలిద్దరూ బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన ఐటం సాంగ్ బాబూజీ జరధీరే చలో పాటకు హుషారుగా స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా స్పెప్పులు వేస్తూ మతి పోగొట్టేశారు. వీళ్లిద్దరి గురించి తెలియనివాళ్లు ఈ వీడియో చూస్తే హీరోయిన్లు డ్యాన్స్ చేస్తున్నారనే గ్యారంటీగా అనుకుంటారు. వీళ్లిద్దరికి తెలుగు రాష్ట్రాల్లో అభిమానులకు లోటు లేదు కాబట్టి ఈ వీడియోను పోటాపోటీగా షేర్ చేస్తున్నారు.

రష్మి - అనసూయ ఇద్దరూ యాంకరింగ్ పేరు తెచ్చుకున్నాకే సినిమాల్లోకి అడుగుపెట్టారు. రష్మి గుంటూరు టాకీస్ సినిమాతో గ్లామర్ ప్రియులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెళ్లయిన అనసూయ మాత్రం కాస్త నటనాపరంగా స్కోప్ ఉండే పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా రంగస్థలం మూవీలోని రంగమ్మత్త పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English