సాయి పల్లవీ.. వై దిస్ కొలవెరి?

సాయి పల్లవీ.. వై దిస్ కొలవెరి?

ప్రేమమ్ సినిమాతో మళయాళ ఇండస్ట్రీలో.. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో సాయిపల్లవికి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. మొదటి సినిమాలోనే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడమే కాదు.. ఆవిషయంలో అదరగొట్టేసిందనే పేరు సంపాదించేసుకుంది. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ కావడంతో డైరెక్టర్లందరి దృష్టి సాయిపల్లవిపై పడింది.

అనూహ్యంగా వచ్చిన ఈ స్టార్ డమ్ నిలబెట్టుకోవడంలో సాయిపల్లవి పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఫిదా తరవాత ఆమె నటిస్తున్న ప్రతి సినిమాలోనూ హీరోలతో తేడా కొట్టిందనే మాట  వినిపిస్తూనే ఉంది. హీరో నాని ఎంసీఏ సినిమా చేస్తున్న టైంలో సాయిపల్లవి తీరుతో తీవ్రంగా హర్టయ్యాడనే మాట వినిపించింది. తరవాత వచ్చిన కణం సినిమాలో ఆమె పక్కన హీరోగా నటించిన నాగశౌర్య అయితే ఆమెపై డైరెక్ట్ గానే తిట్ల దండకం అందుకున్నాడు. ఆమె ఈగోను ఎవరూ భరించలేరంటూ కామెంట్ చేశాడు.

సాయిపల్లవి తాజాగా శర్వానంద్ హీరోగా నటిస్తున్న పడిపడి లేచే మనసు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పటిలాగే ఈసారి తన ప్రవర్తనతో హీరో శర్వానంద్ ను తీవ్రంగా హర్ట్ చేసిందని టాక్. ఆమె ధోరణితో విసిగిపోయి శర్వా షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయాడట. చివరకు యూనిట్ సభ్యులంతా ఎలాగో బతిమాలి ఆయన్ను కెమెరా ముందుకు తీసుకొచ్చారని తెలిసింది. షూటింగ్ టైంలో సాయిపల్లవి తీరుపై టాలీవుడ్ లో బోలెడన్ని కామెంట్లు వస్తున్నాయి. కానీ నేనింతే.. నా తీరింతే అన్నట్టుగానే ఆమె ఉంటోంది. సాయిపల్లవీ నీ చుట్టూ ఏంటీగోల.. ప్రతి హీరోతోనూ ఈ ఇగో ప్రాబ్లెమ్స్ ఎందుకొస్తున్నాయి? వైదిస్ కొలవెరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు