ఒకవేళ రెండూ ఆడేస్తాయేమో!!

ఒకవేళ రెండూ ఆడేస్తాయేమో!!

మహానటి సినిమా తరవాత బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి కనిపించడం లేదు.  ఈమధ్యrn కాలంలో వచ్చిన అన్ని సినిమాలు వారం పది రోజులకే థియేటర్ల నుంచి rnమాయమైపోతున్నాయి. ఆర్ఎక్స్ 100 మంచి హిట్ కొట్టినా అది పూర్తిగా యూత్ rnఓరియంటెడ్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ దానికి కాస్త దూరంగానే ఉన్నారు.

ఈrn నెలకు పెద్దగా మెరుపులు కనిపించే అవకాశం లేదని తేలిపోయింది. ఆగస్టులో rnమాత్రం రెండు సినిమాలు ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. నితిన్ - రాశీఖన్నాrn జంటగా వస్తున్న శ్రీనివాస కళ్యాణంపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆసక్తి rnఉంది. శతమానం భవతి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దిల్ రాజు సతీష్ వేగేశ్నల rnకాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇదేనెలలో rnవిజయ్ దేవరకొండ - ఛలో ఫేం హీరోయిన్ రష్మిక మందన్న నటించిన గీతగోవిందం rnరిలీజ్ కానుంది. ఇందులో విజయ్ - రష్మికల జంట చూడముచ్చటగా ఉండటం.. క్లీన్ rnఎంటర్ టెయినర్ లతో మెప్పించిన దర్శకుడు పరశురామ్ తీసిన సినిమా కావడంతో rnగీతగోవిందంపైనా ప్రేక్షకుల్లో మంచి బజ్ వచ్చింది. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ rnపై ఈ మూవీ నిర్మించారు.

ఇప్పటికే గీతగోవిందం - శ్రీనివాస కళ్యాణం rnసినిమాల రెండింటి టీజర్లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రెండు టీజర్లు rnవ్యూయర్లను బ్రహ్మాండంగా మెప్పించాయి. ఇప్పటికే 2 మిలియన్లకు పైగా వ్యూస్ rnవచ్చాయి. చూడబోతే రెండు సినిమాలకు వస్తున్న బజ్ చూస్తుంటే రెండూ ఆడేలాగానే rnకనిపిస్తున్నాయి. సినిమాలో కంటెంట్ మెప్పించేలా ఉండే కానీ రెండూ మంచి rnకలెక్షన్లు రాబడతాయన్న అంచనాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్లు కూడా ఆ విషయంలో rnధీమాగానే మాట్లాడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు