న‌య‌న్ బాట‌లో అనుష్క‌!

న‌య‌న్ బాట‌లో అనుష్క‌!

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ పేరు చెబితే విజ‌య శాంతి పేరు గుర్తుకు వ‌చ్చేంది. ఆ త‌ర్వాత ఆ లోటును సౌంద‌ర్య భ‌ర్తీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆ త‌ర్వాత‌ అడ‌పా ద‌డ‌పా కొంత‌మంది కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోన‌టించినా పెద్ద గుర్తింపు రాలేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఆ లోటును అనుష్క తీరుస్తోంది. `అరుంధ‌తి`.. `పంచాక్ష‌రి`, 'రుద్రమదేవి` `వ‌ర్ణ‌`.. ..`జీరో సైజ్`.... 'భాగమతి` వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌తో అనుష్క మంచి పేరు తెచ్చుకుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అనుష్క‌...మ‌రో లేడీఓరియంటెడ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దాంతోపాటు, అనుష్క కోస‌మే ఆ త‌ర‌హా క‌థ‌లు మ‌రో రెండు సిద్ధ‌మ‌వుతున్నట్లు టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి.

కొత్త దర్శకుడు హేమంత్ చెప్పిన క‌థ అనుష్కకు న‌చ్చ‌డంతో ఆ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. కోన కార్పొరేషన్, పీపుల్స్ మీడియా సంస్థ వారు  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రంలో లో అనుష్క సరసన విల‌క్ష‌ణ న‌టుడు మాధవన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. తమిళంలో `మాయ‌`, `క‌ర్త‌వ్యం`, `వాసుకి` వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో నయనతార దూసుకుపోతోన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో మ‌రో రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌లో న‌టించేందుకు న‌య‌న్ రెడీగా ఉంది. న‌య‌న్ బాట‌లోనే తెలుగులో అనుష్క కూడా సెల‌క్టివ్ గా ఈ త‌ర‌హా సినిమాల‌ను ఎంచుకుంటుందేమో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు