ఇంకో పవన్‌ కళ్యాణ్‌ అవుతున్నాడా?

ఇంకో పవన్‌ కళ్యాణ్‌ అవుతున్నాడా?

పవన్‌ కళ్యాణ్‌ తర్వాత చాలా మంది స్టార్లు ఎదిగారు కానీ యూత్‌లో ఒక రివల్యూషన్‌లా, ఒక ఐకాన్‌గా మారిపోయిన హీరో మాత్రం మరొకరు లేరు. పవన్‌ అభిమానుల్లో అత్యధికులు ఎప్పుడూ యువతరమే. హీరోగా కెరియర్‌ మొదట్లో యూత్‌ని ఆకట్టుకున్న పవన్‌ ఆ తర్వాతి తరం యువతని కూడా తన లైఫ్‌ స్టయిల్‌, అగ్రెషన్‌తో ఆకట్టుకున్నాడు. పవన్‌ మాదిరిగా మళ్లీ యూత్‌లో అంత సెన్సేషన్‌ అవుతోంది విజయ్‌ దేవరకొండ మాత్రమే. ఇప్పటికే తన సినిమాల ఎంపికతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ నానాటికీ బలం పుంజుకుంటున్నాడు.

అతడు ఇప్పటికే యూత్‌లో తిరుగులేని ఇమేజ్‌ సాధించేసుకున్నాడు. తనకొచ్చిన ఇమేజ్‌ని కాపాడుకుంటూ యూత్‌ని మరింత ప్రభావితం చేసేలా విజయ్‌ తన సినిమాలు ఎంచుకుంటున్నాడు. ప్రతి పనీ వారికి నచ్చేలానే చేస్తున్నాడు. 'గీత గోవిందం' చిత్రానికి వచ్చేసిన క్రేజ్‌ చూసి పరిశ్రమ అవాక్కవుతోంది. అర్జున్‌రెడ్డి మాదిరిగా ఇది వైరల్‌ అయ్యే స్టఫ్‌ కాకపోయినా కానీ విజయ్‌ ఫ్యాక్టర్‌తో ఈ చిత్రం క్రేజీగా మారింది. ఇది కూడా పెద్ద విజయం సాధించి యూత్‌ని వెర్రెత్తిస్తే మాత్రం మరో పవన్‌కళ్యాణ్‌ అయ్యే దిశగా విజయ్‌ మరో నాలుగు అడుగులు ముందుకేసినట్టే భావించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు