ఓవియా మాదిరిగా కౌశల్‌కి బిగ్‌బాస్‌ చెక్‌

ఓవియా మాదిరిగా కౌశల్‌కి బిగ్‌బాస్‌ చెక్‌

బిగ్‌బాస్‌ షోకి వెళ్లిన వారిలో ఎవరు విజేత అవుతారనేది చెప్పడం కష్టం. ప్రేక్షకులకి ఎవరైతే కనక్ట్‌ అవుతారో వారే ఓటింగ్స్‌లో ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటూ వుంటారు. అయితే ఒక్కోసారి ఆ ఇంట్లో జరిగే తప్పుల వల్ల కొందరు వీక్‌ అనిపించిన వాళ్లు కూడా సెన్సేషన్‌ అయిపోతూ వుంటారు. ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో అదే జరుగుతోంది.

హౌస్‌లోకి వచ్చినపుడు ఎలాంటి ప్రభావం చూపించని టీవీ నటుడు కౌశల్‌ ఇప్పుడు శక్తిగా మారాడు. అతడిని తేజస్వి టీమ్‌ కార్నర్‌ చేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడంతో కౌశల్‌ కోసం ఒక ఆర్మీ సిద్ధమైంది. అతడిని నామినేషన్లలో వున్నపుడు కాపాడడమే కాకుండా, హౌస్‌లో అతనికి వ్యతిరేకంగా ఆడిన ఎవరినైనా ఏరి పారేస్తోంది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనిపించుకున్న భానుశ్రీ కేవలం కౌశల్‌ సేన కారణంగానే ఎలిమినేట్‌ అయింది. తేజస్వి లాంటి పాపులర్‌ నటి కూడా ఎలిమినేట్‌ అవడంతో బిగ్‌బాస్‌కి షాక్‌ తగిలింది. ఆమెని ఎలాగైనా మళ్లీ షోలోకి తీసుకురావడానికి బిగ్‌బాస్‌ వేరే రూట్లు చూస్తోందనుకోండి. అయితే ఈలోగా కౌశల్‌కి చెక్‌ పెట్టి అతడిని బయటకి పంపించి, అతడి సేనని కూడా కంట్రోల్‌ చేయడానికి పావులు కదుపుతోంది.

తమిళంలో గత సీజన్‌లో ఓవియా అనే నటికి సిమిలర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎదురయితే ఓవియా ఆర్మీ ఫార్మ్‌ అయింది. ఆమె ఎప్పుడు నామినేషన్లలోకి వచ్చినా కానీ ఆ సేన అండగా నిలిచింది. దీంతో ఆమెని ఒంటరిని చేసి, తనంతట తానుగా షో నుంచి వైదొలగేటట్టు బిగ్‌బాస్‌ చేసింది. ప్రస్తుతం కౌశల్‌ని కూడా కార్నర్‌ చేస్తున్నారు. మొత్తం అందరూ అతనికి ఎదురు తిరిగారు. కాకపోతే ఓవియా మాదిరిగా కౌశల్‌ వీక్‌ మైండ్‌సెట్‌ వున్నవాడు కాదు కనుక సెల్ఫ్‌ ఎలిమినేట్‌ చేసుకోకపోవచ్చు కానీ ఈలోగా అతడి బలహీనతల్ని బాగా బయటపెట్టి బయటకి పంపించడానికి మాత్రం ప్రయత్నాలు ముమ్మరమవుతాయి. అతను బయటకి వెళ్లకపోతే ఈ షో కంట్రోల్‌ కౌశల్‌ సేన చేతిలో వుంటుందనే భయమయితే బిగ్‌బాస్‌ నిర్వాహకుల్లో ఆల్రెడీ వచ్చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు