మెగా ఫ్యామిలీ నీడలో ఎదగలేక...

మెగా ఫ్యామిలీ నీడలో ఎదగలేక...

నీహారిక కొణిదెల హీరోయిన్‌ అవుతుందని ప్రకటించినపుడు స్టార్‌ అయిపోతుందని భావించారు. అయితే పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలని తెలుగు సినిమా ఎప్పుడూ ఎంకరేజ్‌ చేయలేదు. వేరే ఫ్యామిలీస్‌కి చెందిన అమ్మాయిలతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి స్టార్‌ హీరోలు మొగ్గు చూపరు. బాలీవుడ్‌లో మాదిరిగా హీరోయిన్‌గా రాగానే పెద్ద చిత్రాల్లో ఆఫర్లు ఇక్కడి టాప్‌ ఫ్యామిలీస్‌కి చెందిన అమ్మాయిలకి రావు.

నీహారిక మొదటి సినిమాలో నాగ శౌర్య సరసన నటించింది. ఆ చిత్రానికి తగినంత క్రేజ్‌ రాకపోవడంతో ఫ్లాపయింది. ఆ తర్వాత మరో చిత్రంలో నటించడానికి ఆమె చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఫైనల్‌గా సుమంత్‌ అశ్విన్‌తో హ్యాపీ వెడ్డింగ్‌ చేసింది. సుమంత్‌ అశ్విన్‌కి హీరోగా ఈమధ్య హిట్లే లేకపోవడంతో ఈ చిత్రానికి అసలు క్రేజ్‌ లేదు.

మెగా ఫ్యామిలీ నుంచి పలువురు వచ్చి ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తున్నా కానీ కాస్తయినా హైప్‌ రాలేదు. అసలే సాక్ష్యంతో పాటు రిలీజ్‌ అవుతోంది కనుక ప్రేక్షకుల దృష్టిని తిప్పుకోవడం కష్టమైన విషయమే. మెగా ఫ్యామిలీ ట్యాగ్‌ వల్ల ఆ కుటుంబానికి చెందిన కుర్రాళ్లకి కలిసి వస్తున్నా కానీ ఆ నీడలో నీహారిక అయితే పాపం ఎదగలేకపోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English