జాన్వీపై రాజమౌళి కన్ను!

జాన్వీపై రాజమౌళి కన్ను!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కి బాలీవుడ్‌లో లభించిన సాదర స్వాగతంతో ఆమెని ఎలాగైనా దక్షిణాదిలో పరిచయం చేయాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుంటే రాజమౌళి తీయనున్న ఎన్టీఆర్‌, చరణ్‌ మల్టీస్టారర్‌లో జాన్వీ ఒక కథానాయికగా నటించే అవకాశముందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని హిందీతో సహా మల్టిపుల్‌ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేయనున్నారు కనుక జాన్వీ ఒక కథానాయిక అయితే క్రేజ్‌ వస్తుందని రాజమౌళి బృందం ఆలోచిస్తోందట.

జాన్వీని పరిచయం చేసిన కరణ్‌ జోహార్‌తో రాజమౌళికి వున్న అనుబంధం ఏమిటో తెలిసిందే. ప్రస్తుతం జాన్వీకి గాడ్‌ఫాదర్‌ అవతారం ఎత్తిన కరణ్‌ చెబితే ఆమె ఖచ్చితంగా రాజమౌళి చిత్రంలో నటిస్తుంది. అయితే తన సినిమా కోసం కనీసం వంద రోజుల పైగా కాల్షీట్లు ఇవ్వాల్సి వస్తుంది. జాన్వీకి మరే సినిమాతో క్లాష్‌ లేకపోతే, వంద రోజుల కాల్షీట్లు గుత్తంగా ఇవ్వగలిగితే ఈ చిత్రంలో నటించే అవకాశముంటుంది. ప్రస్తుతం గాసిప్‌గా వినిపిస్తోన్న ఈ న్యూస్‌ నిజమవుతుందా లేదా అనేదాని కోసం వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English